కీర్తనలు 115: 10
క్రాస్-రిఫరెన్స్‌లు
" అహరోను వంశస్థులారా, యెహోవాను నమ్ముకొనుడి. ఆయన వారికి సహాయము వారికి కేడెము"
సంబంధిత రిఫరెన్స్‌లు
ఆయన కృప నిరంతరము నిలుచునని ఇశ్రాయేలీయులు అందురు గాక.
ఆయన కృప నిరంతరము నిలుచునని అహరోను వంశస్థులు అందురు గాక.
ఆయన కృప నిరంతరము నిలుచునని యెహోవా యందు భయభక్తులు గలవారు అందురు గాక.
ఇశ్రాయేలు వంశీయులారా, యెహోవాను సన్నుతించుడి అహరోను వంశీయులారా, యెహోవాను సన్నుతించుడి
లేవి వంశీయులారా, యెహోవాను సన్నుతించుడి యెహోవాయందు భయభక్తులు గలవారలారా, యెహోవాను సన్నుతించుడి.
కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధన ననుసరించి నడిచినయెడల మీరు సమస్తదేశ జనులలో నాకు స్వకీయ సంపాద్యమగుదురు.
జనులారా, యెల్లప్పుడు ఆయనయందు నమ్మికయుంచుడి ఆయన సన్నిధిని మీ హృదయములు కుమ్మరించుడి దేవుడు మనకు ఆశ్రయము.(సెలా.)
యెహోవాయందు నమ్మికయుంచువారు కదలక నిత్యము నిలుచు సీయోను కొండవలెనుందురు.
ఇశ్రాయేలూ, యెహోవా మీద ఆశపెట్టుకొనుము యెహోవా యొద్ద కృప దొరుకును. ఆయనయొద్ద సంపూర్ణ విమోచన దొరుకును.
ఎవనికి యాకోబు దేవుడు సహాయుడగునో ఎవడు తన దేవుడైన యెహోవామీద ఆశపెట్టుకొనునో వాడు ధన్యుడు
ఆయన ఆకాశమును భూమిని సముద్రమును దానిలోని సర్వమును సృజించినవాడు ఆయన ఎన్నడును మాట తప్పనివాడు.
ఆపత్కాలమందు నీవే నా ఆశ్రయము, నాకు అధైర్యము పుట్టింపకుము.
నన్ను సిగ్గుపడనియ్యక నన్ను తరుమువారిని సిగ్గుపడనిమ్ము నన్ను దిగులుపడనియ్యక వారిని దిగులుపడనిమ్ము, వారిమీదికి ఆపద్దినము రప్పించుము, రెట్టింపు నాశనముతో వారిని నశింపజేయుము.
దేవుడు తన చిత్తప్రకారమైన సంకల్పమునుబట్టి మనలను ముందుగా నిర్ణయించి, ఆయనయందు స్వాస్థ్యముగా ఏర్పరచెను. ఆయన తన చిత్తానుసారముగా చేసిన నిర్ణయము చొప్పున సమస్తకార్యములను జరిగించుచున్నాడు.
మనము యెహోవా పరిశుద్ధనామమందు నమ్మికయుంచి యున్నాము. ఆయననుబట్టి మన హృదయము సంతోషించుచున్నది
మన ప్రాణము యెహోవాకొరకు కనిపెట్టుకొనుచున్నది ఆయనే మనకు సహాయమును మనకు కేడెమునై యున్నాడు.
దేవుడైన యెహోవా సూర్యుడును కేడెమునైయున్నాడు యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును యథార్థముగా ప్రవర్తించువారికి ఆయన యే మేలును చేయక మానడు.
ఇశ్రాయేలూ, నీ భాగ్యమెంత గొప్పది యెహోవా రక్షించిన నిన్ను పోలినవాడెవడు? ఆయన నీకు సహాయకరమైన కేడెము నీకు ఔన్నత్యమును కలిగించు ఖడ్గము నీ శత్రువులు నీకు లోబడినట్లుగా వారు వేషము వేయుదురు నీవు వారి ఉన్నతస్థలములను త్రొక్కుదువు.
దేవుని మాటలన్నియు పుటము పెట్టబడినవే ఆయనను ఆశ్రయించువారికి ఆయన కేడెము.
నా దుర్గము, నేను ఆయనను ఆశ్రయించుదును. నా కేడెము నా రక్షణశృంగము నా ఉన్నతదుర్గము నా ఆశ్రయస్థానము. ఆయనే నాకు రక్షకుడు బలాత్కారులనుండి నన్ను రక్షించువాడవు నీవే.
ఇశ్రాయేలూ, ఇది మొదలుకొని నిత్యము యెహోవా మీదనే ఆశపెట్టుకొనుము.
నీ స్వబుద్ధిని ఆధారము చేసికొనక నీ పూర్ణహృదయముతో యెహోవాయందు నమ్మకముంచుము
కాబట్టి ప్రభువు నాకు సహాయుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేమి చేయగలడు? అని మంచి ధైర్యముతో చెప్పగలవారమై యున్నాము.