కీర్తనలు 136: 9
క్రాస్-రిఫరెన్స్‌లు
" రాత్రి నేలుటకు ఆయన చంద్రుని నక్షత్రములను చేసెను ఆయన కృప నిరంతరముండును."
సంబంధిత రిఫరెన్స్‌లు
సూర్యచంద్రులారా, ఆయనను స్తుతించుడి కాంతిగల నక్షత్రములారా, మీరందరు ఆయనను స్తుతించుడి.
పగటి వెలుగుకై సూర్యుని, రాత్రి వెలుగుకై చంద్ర నక్షత్రములను నియమించువాడును, దాని తరంగములు ఘోషించునట్లు సముద్రమును రేపువాడునగు యెహోవా ఆ మాట సెలవిచ్చుచున్నాడు, సైన్యములకధిపతియగు యెహోవా అని ఆయనకు పేరు.
ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపజేసి, నీతిమంతుల మీదను, అనీతిమంతుల మీదను వర్షము కురిపించుచున్నాడు.
దేవుడు ఆ రెండు గొప్ప జ్యోతులను, అనగా పగటిని ఏలుటకు పెద్ద జ్యోతిని రాత్రిని ఏలుటకు చిన్న జ్యోతిని నక్షత్రములను చేసెను.
అరుణోదయము భూమి దిగంతములవరకు వ్యాపించునట్లును
పగటికి పగలు బోధచేయుచున్నది. రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుచున్నది.
నీ సూచక క్రియలను చూచి దిగంత నివాసులును భయపడుదురు ఉదయ సాయంత్రముల ఉత్పత్తులను నీవు సంతోష భరితములుగా చేయుచున్నావు.