లేఖనాలను అన్వేషించండి

రోమీయులకు 15: 22

క్రాస్-రిఫరెన్స్‌లు

" ఈ హేతువు చేతను మీయొద్దకు రాకుండ నాకు అనేక పర్యాయములు ఆటంకము కలిగెను."

సంబంధిత రిఫరెన్స్‌లు

యెషయా 52:15

ఆలాగే అతడు అనేక జనములను చిలకరించును రాజులు అతని చూచి నోరు మూసికొనెదరు తమకు తెలియజేయబడని సంగతులు వారు చూచెదరు తాము విననిదానిని గ్రహింతురు.

యెషయా 65:1

నాయొద్ద విచారణచేయనివారిని నా దర్శనమునకు రానిచ్చితిని నన్ను వెదకనివారికి నేను దొరికితిని. నేనున్నాను ఇదిగో నేనున్నాను అని నా పేరు పెట్టబడని జనముతో చెప్పుచున్నాను.

యెషయా 66:19

నేను వారియెదుట ఒక సూచక క్రియను జరిగించెదను వారిలో తప్పించుకొనినవారిని విలుకాండ్రైన తర్షీషు పూలు లూదు అను జనులయొద్దకును తుబాలు యావాను నివాసులయొద్దకును నేను పంపెదను నన్నుగూర్చిన సమాచారము విననట్టియు నా మహిమను చూడనట్టియు దూరద్వీపవాసులయొద్దకు వారిని పంపెదను వారు జనములలో నా మహిమను ప్రకటించెదరు.

మార్కు 9:42

నాయందు విశ్వాసముంచు ఈ చిన్నవారిలో నొకని అభ్యంతరపరచువాడెవడో, వాడు మెడకు పెద్ద తిరుగటిరాయి కట్టబడి సముద్రములో పడవేయబడుట వానికి మేలు.