లేఖనాలను అన్వేషించండి

రూతు 2: 14

క్రాస్-రిఫరెన్స్‌లు

" బోయజు భోజనకాలమున నీ విక్కడికి వచ్చి భోజనముచేసి, చిరకలో నీ ముక్క ముంచి, తినుమని ఆమెతో చెప్పగా, చేను కోయువారియొద్ద ఆమె కూర్చుండెను. అతడు ఆమెకు పేలాలు అందియ్యగా ఆమె తిని తృప్తిపొంది కొన్ని మిగిల్చెను."

సంబంధిత రిఫరెన్స్‌లు

యోబు 31:16

బీదలు ఇచ్ఛయించినదానిని నేను బిగబట్టినయెడలను విధవరాండ్ర కన్నులు క్షీణింపజేసినయెడలను

యోబు 31:17

తలిదండ్రులు లేనివారిని నా అన్నములో కొంచెమైనను తిననియ్యక నేను ఒంటరిగా భోజనము చేసినయెడలను

యోబు 31:18

ఎవడైనను వస్త్రహీనుడై చచ్చుట నేను చూడగను బీదలకు వస్త్రము లేకపోవుట నేను చూడగను

యోబు 31:19

వారి దేహములు నన్ను దీవింపకపోయినయెడలను వారు నా గొఱ్ఱలబొచ్చుచేత వేడిమి పొందకపోయినయెడలను

యోబు 31:20

గుమ్మములో నాకు సహాయము దొరకునని తండ్రిలేనివారిని నేను అన్యాయము చేసినయెడలను

యోబు 31:21

నా భుజశల్యము దాని గూటినుండి పడును గాక నా బాహువు ఎముకలోనికి విరుగును గాక.

యోబు 31:22

నేనాలాగు చేయలేదు, నా బాల్యము మొదలుకొని దిక్కులేనివాడు తండ్రిభావముతో నన్ను భావించి నాయొద్ద పెరిగెను. నా తల్లి గర్భమందు పుట్టిననాటనుండి దిక్కులేని వానికి నేను మార్గదర్శినైతిని.

సామెతలు 11:24

వెదజల్లి అభివృద్ధి పొందువారు కలరు తగినదానికన్న తక్కువ ఇచ్చి లేమికి వచ్చువారు కలరు.

సామెతలు 11:25

ఔదార్యము గలవారు పుష్టి నొందుదురు. నీళ్లు పోయువారికి నీళ్లు పోయబడును

యెషయా 32:8

ఘనులు ఘనకార్యములు కల్పించుదురు వారు ఘనకార్యములనుబట్టి నిలుచుదురు.

యెషయా 58:7

నీ ఆహారము ఆకలిగొనినవారికి పెట్టుటయు నీ రక్తసంబంధికి ముఖము తప్పింపకుండుటయు దిక్కుమాలిన బీదలను నీ యింట చేర్చుకొనుటయు

యెషయా 58:10

ఆశించినదానిని ఆకలిగొనిన వానికిచ్చి శ్రమపడినవానిని తృప్తిపరచినయెడల చీకటిలో నీ వెలుగు ప్రకాశించును అంధకారము నీకు మధ్యాహ్నమువలె నుండును.

యెషయా 58:11

యెహోవా నిన్ను నిత్యము నడిపించును క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరచి నీ యెముకలను బలపరచును నీవు నీరుకట్టిన తోటవలెను ఎప్పుడును ఉబుకుచుండు నీటి ఊటవలెను ఉండెదవు.

లూకా 14:12

మరియు ఆయన తన్ను పిలిచినవానితో ఇట్లనెను నీవు పగటి విందైనను రాత్రి విందైనను చేయునప్పుడు, నీ స్నేహితులనైనను నీ సహోదరులనైనను నీ బంధువులనైనను ధనవంతులగు నీ పొరుగువారినైనను పిలువవద్దు; వారు ఒకవేళ నిన్ను మరల పిలుతురు గనుక నీకు ప్రత్యుపకారము కలుగును.

లూకా 14:13

అయితే నీవు విందు చేయునప్పుడు బీదలను అంగహీనులను కుంటివాండ్రను గ్రుడ్డివాండ్రను పిలువుము.

లూకా 14:14

నీకు ప్రత్యుపకారము చేయుటకు వారికేమియు లేదు గనుక నీవు ధన్యుడవగుదువు; నీతిమంతుల పునరుత్థానమందు నీవు ప్రత్యుపకారము పొందుదువని చెప్పెను.

1సమూయేలు 17:17

యెష్షయి తన కుమారుడైన దావీదును పిలిచి నీ సహోదరులకొరకు వేయించిన యీ గోధుమలలో ఒక తూమెడును ఈ పది రొట్టెలను తీసికొని దండులో నున్న నీ సహోదరుల దగ్గరకు త్వరగా పొమ్ము.

1సమూయేలు 25:18

అందుకు అబీగయీలు నాబాలుతో ఏమియు చెప్పక త్వరపడి రెండువందల రొట్టెలను, రెండు ద్రాక్షారసపు తిత్తులను, వండిన అయిదు గొఱ్ఱల మాంసమును, అయిదు మానికల వేచిన ధాన్యమును, నూరు ద్రాక్షగెలలను, రెండువందల అంజూరపు అడలను గార్దభములమీద వేయించి

2సమూయేలు 17:28

అరణ్యమందు జనులు అలసినవారై ఆకలిగొని దప్పిగొనియుందురని తలంచి, పరుపులు పాత్రలు కుండలు గోధుమలు యవలుపిండి వేచిన గోధుమలు కాయధాన్యములు చిక్కుడుకాయలు పేలాలు

ద్వితియోపదేశాకాండము 8:10

నీవు తిని తృప్తిపొంది నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన మంచి దేశమునుబట్టి ఆయనను స్తుతింపవలెను.

ద్వితియోపదేశాకాండము 11:15

మరియు నీవు తిని తృప్తిపొందునట్లు నీ పశువులకొరకు నీ చేలయందు గడ్డి మొలిపించెదను.

2రాజులు 4:43

అయితే అతని పనివాడు నూరుమందికి వడ్డించుటకు ఇవి యెంతవని చెప్పగా అతడు వారు తినగా మిగులునని యెహోవా సెలవిచ్చియున్నాడు గనుక జనులు భోజనము చేయునట్లు వడ్డించుమని మరల ఆజ్ఞ ఇచ్చెను.

2రాజులు 4:44

పనివాడు వారికి వడ్డింపగా యెహోవా సెలవిచ్చినట్లు అది వారు తినిన తరువాత మిగిలిపోయెను.

మత్తయి 14:20

వారందరు తిని తృప్తిపొందిన తరువాత మిగిలిన ముక్కలు పండ్రెండు గంపలనిండ ఎత్తిరి

కీర్తనలు 23:5

నా శత్రువులయెదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు నూనెతో నా తల అంటియున్నావు నా గిన్నె నిండి పొర్లుచున్నది.