లేఖనాలను అన్వేషించండి

రూతు 2: 17

క్రాస్-రిఫరెన్స్‌లు

" కాబట్టి ఆమె అస్తమయము వరకు ఆ చేనిలో ఏరుకొనుచు, తాను ఏరుకొనిన దానిని దుల్లకొట్టగా అవి దాదాపు తూమెడు యవలాయెను."

సంబంధిత రిఫరెన్స్‌లు

సామెతలు 31:27

ఆమె తన యింటివారి నడతలను బాగుగా కనిపెట్టును పనిచేయకుండ ఆమె భోజనము చేయదు.

నిర్గమకాండము 16:36

ఓమెరు అనగా ఏపాలో దశమ భాగము.

యెహెజ్కేలు 45:11

తూము పందుములో పదియవ పాలు పట్టునదై యుండవలెను, పందుము మీకు పరిమాణముగా నుండవలెను.

యెహెజ్కేలు 45:12

తులమొకటింటికి ఇరువది చిన్నముల యెత్తును, అరవీసె యొకటింటికి ఇరువది తులముల యెత్తును, ఇరువదియైదు తులముల యెత్తును పదునైదు తులముల యెత్తును ఉండవలెను.

ఆదికాండము 24:15

అతడు మాటలాడుట చాలింపకముందే అబ్రాహాము సహోదరుడైన నాహోరు భార్యయగు మిల్కా కుమారుడైన బెతూయేలుకు పుట్టిన రిబ్కా కడవ భుజము మీద పెట్టుకొనివచ్చెను.