లేఖనాలను అన్వేషించండి

1సమూయేలు 1: 5

క్రాస్-రిఫరెన్స్‌లు

" హన్నా తనకు ప్రియముగా నున్నందున ఆమెకు రెండుపాళ్లు ఇచ్చుచు వచ్చెను. యెహోవా ఆమెకు సంతులేకుండచేసెను."

సంబంధిత రిఫరెన్స్‌లు

ఆదికాండము 43:34

మరియు అతడు తన యెదుటనుండి వారికి వంతులెత్తి పంపెను. బెన్యామీను వంతు వారందరి వంతులకంటె అయిదంతలు గొప్పది. వారు విందు ఆరగించి అతనితో కలిసి సంతుష్టిగా త్రాగిరి.

ఆదికాండము 45:22

అతడు వారికి రెండేసి దుస్తుల బట్టలు ఇచ్చెను; బెన్యామీనుకు మూడువందల తులముల వెండియును ఐదు దుస్తుల బట్టలు ఇచ్చెను,

ఆదికాండము 29:30

యాకోబు రాహేలును కూడెను, మరియు అతడు లేయాకంటె రాహేలును బహుగా ప్రేమించి అతనికి మరియేడేండ్లు కొలువు చేసెను.

ఆదికాండము 29:31

లేయా ద్వేషింపబడుట యెహోవా చూచి ఆమె గర్భము తెరిచెను, రాహేలు గొడ్రాలై యుండెను.

ద్వితియోపదేశాకాండము 21:15

ప్రేమింపబడున దొకతెయు ద్వేషింపబడున దొకతెయు ఇద్దరు భార్యలు ఒక పురుషునికి కలిగియుండి, ప్రేమింపబడినదియు ద్వేషింపబడినదియు వానివలన బిడ్డలు కని

ఆదికాండము 20:18

ఏలయనగా అబ్రాహాము భార్యయైన శారానుబట్టి దేవుడు అబీమెలెకు ఇంటిలో ప్రతి గర్భమును మూసియుండెను.

ఆదికాండము 30:2

యాకోబు కోపము రాహేలుమీద రగులుకొనగా అతడు నేను నీకు గర్భఫలమును ఇయ్యకపోయిన దేవునికి ప్రతిగా నున్నానా అనెను.

ఆదికాండము 30:23

అప్పుడామె గర్భవతియై కుమారుని కనిదేవుడు నా నింద తొలగించెననుకొనెను.

1సమూయేలు 9:23

పచనకర్తతో నేను నీ దగ్గరనుంచుమని చెప్పి నీచేతికి ఇచ్చిన భాగమును తీసికొని రమ్మనగా

యోబు 3:10

అది వేకువ కనురెప్పలను చూడకుండును గాక పుట్టుకలోనే నేనేల చావకపోతిని?

లూకా 1:7

ఎలీసబెతు గొడ్రాలైనందున వారికి పిల్లలు లేకపోయిరి; మరియు వారిద్దరు బహు కాలము గడచిన (వృద్ధులైరి.)