లేఖనాలను అన్వేషించండి

1సమూయేలు 4: 17

క్రాస్-రిఫరెన్స్‌లు

" అందుకు అతడు ఇశ్రాయేలీయులు ఫిలిష్తీయుల ముందర నిలువలేక పారిపోయిరి; జనులలో అనేకులు హతులైరి; హొఫ్నీ ఫీనెహాసు అను నీ యిద్దరు కుమారులు మృతులైరి; మరియు దేవుని మందసము పట్టబడెను అని చెప్పెను"

సంబంధిత రిఫరెన్స్‌లు

1సమూయేలు 4:10

ఫిలిష్తీయులు యుద్దము చేయగా ఇశ్రాయేలీయులు ఓడిపోయి అందరు తమ డేరాలకు పరుగెత్తివచ్చిరి. అప్పుడు అత్యధికమైన వధ జరిగెను; ఇశ్రాయేలీయులలో ముప్పదివేల కాల్బలము కూలెను.

1సమూయేలు 4:11

మరియు దేవుని మందసము పట్టబడెను; అదికాకను హొఫ్నీ ఫీనెహాసులను ఏలీ యొక్క యిద్దరు కుమారులు హతులైరి.

1సమూయేలు 3:11

అంతట యెహోవా సమూయేలుతో ఈలాగు సెలవిచ్చెను ఇశ్రాయేలులో నేనొక కార్యము చేయబోవుచున్నాను; దానిని వినువారందరి చెవులు గింగురుమనును.

ఆదికాండము 44:31

అతని ప్రాణము ఇతని ప్రాణముతో పెనవేసికొనియున్నది గనుక ఈ చిన్నవాడు మాయొద్ద లేకపోవుట అతడు చూడగానే చనిపోవును. అట్లు తమ దాసులమైన మేము నెరసిన వెండ్రుకలు గల తమ దాసుడైన మాతండ్రిని మృతుల లోకములోనికి దుఃఖముతో దిగిపోవునట్లు చేయుదుము

సంఖ్యాకాండము 31:6

మోషే వారిని, అనగా ప్రతి గోత్రమునుండి వేయేసిమందిని, యాజకుడగు ఎలియాజరు కుమారుడైన ఫీనెహాసును పంపెను. అతని చేతిలోని పరిశుద్ధమైన ఉపకరణములను ఊదుటకు బూరలను యుద్ధమునకు పంపెను.

1సమూయేలు 1:3

ఇతడు షిలోహునందున్న సైన్యములకధిపతియగు యెహోవాకు మ్రొక్కుటకును బలి అర్పించుటకును ఏటేట తన పట్టణము విడిచి అచ్చటికి పోవుచుండెను. ఆ కాలమున ఏలీయొక్క యిద్దరు కుమారులగు హొప్నీ ఫీనెహాసులు యెహోవాకు యాజకులుగా నుండిరి.

1సమూయేలు 2:31

ఆలకించుము; రాగల దినములలో నీ బలమును నీ పితరుని యింటి బలమును నేను తక్కువ చేతును. నీ యింట ముసలివాడు ఒకడును లేకపోవును.

1సమూయేలు 2:34

నీ యిద్దరు కుమారులైన హొఫ్నీకిని ఫీనెహాసునకును సంభవించునని నేను చెప్పినదానికి నీకు సూచనగా నుండును.ఒక్క నాటియందే వారిద్దరు మరణమవుదురు.

1సమూయేలు 5:1

ఫలిష్తీయులు దేవుని మందసమును పట్టుకొని ఎబెనెజరునుండి అష్డోదునకు తీసికొనివచ్చి

నెహెమ్యా 1:4

ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి యేడ్చి, కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసముండి, ఆకాశమందలి దేవుని యెదుట విజ్ఞాపన చేసితిని.

యోబు 1:14

ఎద్దులు నాగలి దున్నుచు గాడిదలు వాటి సమీపమున మేయుచునుండగా షెబాయీయులు వాటిమీద పడి వాటిని పట్టుకొనిపోయి

కీర్తనలు 44:10

శత్రువులయెదుట నిలువకుండ మమ్మును వెనుకకు పారిపోజేయుచున్నావు మమ్మును ద్వేషించువారు ఇష్టము వచ్చినట్లు మమ్మును దోచుకొనుచున్నారు.

కీర్తనలు 60:1

దేవా, మమ్ము విడనాడియున్నావు మమ్ము చెదరగొట్టియున్నావు నీవు కోపపడితివి మమ్ము మరల బాగుచేయుము.

కీర్తనలు 78:64

వారి యాజకులు కత్తిపాలు కాగా వారి విధవరాండ్రు రోదనము చేయకుండిరి.