లేఖనాలను అన్వేషించండి

1సమూయేలు 4: 6

క్రాస్-రిఫరెన్స్‌లు

" ఫిలిష్తీయులు ఆ కేకలు విని, హెబ్రీయుల దండులో ఈ గొప్ప కేకల ధ్వని యేమని అడిగి, యెహోవా నిబంధన మందసము దండులోనికి వచ్చెనని తెలిసికొని"

సంబంధిత రిఫరెన్స్‌లు

నిర్గమకాండము 32:17

ఆ ప్రజలు పెద్దకేకలు వేయుచుండగా యెహోషువ ఆ ధ్వని విని పాళెములో యుద్ధధ్వని అని మోషేతో అనగా

నిర్గమకాండము 32:18

అతడు అది జయధ్వని కాదు, అపజయ ధ్వని కాదు, సంగీత ధ్వని నాకు వినబడుచున్నదనెను.

నిర్గమకాండము 7:16

అతని చూచి అరణ్యమందు నన్ను సేవించుటకై నా ప్రజలను పోనిమ్మని ఆజ్ఞాపించుటకు గాను హెబ్రీయుల దేవుడైన యెహోవా నన్ను నీయొద్దకు పంపెను. నీవు ఇదివరకు వినకపోతివి.

1సమూయేలు 4:14

ఏలీ ఆ కేకలు విని ఈ గల్లత్తు యేమని అడుగగా ఆ మనుష్యుడు త్వరగా వచ్చి ఏలీతో సంగతి తెలియచెప్పెను.

కీర్తనలు 60:10

దేవా, నీవు మమ్ము విడనాడియున్నావు గదా? దేవా, మా సేనలతోకూడ నీవు బయలుదేరుట మానియున్నావు గదా?

యిర్మియా 34:9

రాజైన సిద్కియా యెరూషలేములోనున్న సమస్త ప్రజలతో నిబంధన చేసిన తరువాత యెహోవా యొద్దనుండి యిర్మీయాకు ప్రత్యక్షమైన వాక్కు

ఫిలిప్పీయులకు 3:5

ఎనిమిదవ దినమున సున్నతి పొందితిని, ఇశ్రాయేలు వంశపువాడనై, బెన్యామీను గోత్రములో పుట్టి హెబ్రీయుల సంతానమైన హెబ్రీయుడనై, ధర్మశాస్త్ర విషయము పరిసయ్యుడనై,