లేఖనాలను అన్వేషించండి

1సమూయేలు 9: 11

క్రాస్-రిఫరెన్స్‌లు

" వారు దైవజనుడుండు ఊరికి పోయిరి. ఊరికి ఎక్కిపోవుచుండగా నీళ్లు చేదుకొనుటకై వచ్చిన కన్యకలు తమకు కనబడినప్పుడు ఇక్కడ దీర్ఘదర్శి యున్నాడా అని అడిగిరి."

సంబంధిత రిఫరెన్స్‌లు

ఆదికాండము 24:11

సాయంకాలమందు స్త్రీలు నీళ్లు చేదుకొనవచ్చు వేళకు ఆ ఊరి బయటనున్న నీళ్లబావియొద్ద తన ఒంటెలను మోకరింపచేసి యిట్లనెను

ఆదికాండము 24:18

అందుకామె అయ్యా త్రాగుమని చెప్పి త్వరగా తన కడవనుచేతిమీదికి దించుకొని అతనికి దాహమిచ్చెను.

ఆదికాండము 24:19

మరియు ఆమె అతనికి దాహమిచ్చిన తరువాత నీ ఒంటెలు త్రాగుమట్టుకు వాటికిని నీళ్లు చేది పోయుదునని చెప్పి

ఆదికాండము 24:20

త్వరగా గాడిలో తన కడవ కుమ్మరించి తిరిగి చేదుటకు ఆ బావికి పరుగెత్తుకొనిపోయి అతని ఒంటెలన్నిటికి నీళ్లు చేదిపోసెను.

నిర్గమకాండము 2:16

మిద్యాను యాజకునికి ఏడుగురు కుమార్తెలుండిరి. వారు వచ్చి తమ తండ్రి మందకు పెట్టుటకు నీళ్లు చేది తొట్లను నింపుచుండగా

న్యాయాధిపతులు 5:11

విలుకాండ్ర ధ్వనికి దూరముగా నుండువారు నీళ్లు చేదుకొను స్థలములలో నుండువారు యెహోవా నీతి క్రియలను ప్రకటించెదరు ఇశ్రాయేలీయుల గ్రామములో ఆయన జరిగించు నీతి క్రియలను వారు ప్రకటించెదరు వినుటకై యెహోవా జనులు ద్వారములలో కూడుదురు.

ఆదికాండము 24:13

చిత్తగించుము, నేను ఈ నీళ్ల ఊటయొద్ద నిలుచుచున్నాను; ఈ ఊరివారి పిల్లలు నీళ్లు చేదుకొనుటకు వచ్చుచున్నారు.

సామెతలు 24:15

భక్తిహీనుడా, నీతిమంతుని నివాసమునొద్ద పొంచియుండకుము వాని విశ్రమస్థలమును పాడుచేయకుము.