1సమూయేలు 9: 15
క్రాస్-రిఫరెన్స్‌లు
" సౌలు అచ్చటికి రేపు వచ్చునని యెహోవా సమూయేలునకు తెలియజేసెను."
సంబంధిత రిఫరెన్స్‌లు
సౌలు సమూయేలునకు కనబడగానే యెహోవా ఇతడే నేను నీతో చెప్పిన మనిషి ఇదిగో ఇతడే నా జనులను ఏలునని అతనితో సెలవిచ్చెను.
ఒకానొక దినమున సమూయేలు సౌలును పిలిచి యెహోవా ఇశ్రాయేలీయులగు తన జనులమీద నిన్ను రాజుగా అభిషేకించుటకై నన్ను పంపెను; యెహోవా మాట వినుము
యెహోవా మర్మము ఆయనయందు భయభక్తులు గలవారికి తెలిసియున్నది ఆయన తన నిబంధనను వారికి తెలియజేయును.
తన సేవకులైన ప్రవక్తలకు తాను సంకల్పించిన దానిని బయలుపరచకుండ ప్రభువైన యెహోవా యేమియు చేయడు.
మీ యెదుటనున్న గ్రామమునకు వెళ్లుడి; అందులో మీరు ప్రవేశింపగానే కట్టబడియున్న యొక గాడిదపిల్ల కనబడును; దానిమీద ఏ మనుష్యుడును ఎప్పుడును కూర్చుండలేదు; దానిని విప్పి, తోలుకొని రండి.
ఎవడైనను మీరెందుకు ఈలాగు చేయుచున్నారని మిమ్మునడిగినయెడల అది ప్రభువునకు కావలసియున్నదని చెప్పుడి. తక్షణమే అతడు దానిని ఇక్కడికితోలి పంపునని చెప్పి వారిని పంపెను.
వారు వెళ్లగా వీధిలో ఇంటిబయట తలవాకిట కట్టబడియున్న గాడిదపిల్ల యొకటి వారికి కనబడెను; దానిని విప్పుచుండగా,
ఆయన మీరు పట్టణములోనికి వెళ్లుడి; అక్కడ నీళ్లకుండ మోయుచున్న యొక మనుష్యుడు మీకెదురుపడును;
వాని వెంటబోయి వాడు ఎక్కడ ప్రవేశించునో ఆ యింటి యజమానుని చూచి నేను నా శిష్యులతో కూడ పస్కాను భుజించుటకు నా విడిదిగది యెక్కడనని బోధకుడడుగుచున్నాడని చెప్పుడి.
అతడు సామగ్రితో సిద్ధపరచబడిన గొప్ప మేడగది మీకు చూపించును; అక్కడ మనకొరకు సిద్ధపరచుడని చెప్పి తన శిష్యులలో ఇద్దరిని పంపెను.
శిష్యులు వెళ్లి పట్టణములోనికి వచ్చి ఆయన వారితో చెప్పినట్టు కనుగొని పస్కాను సిద్ధపరచిరి.
ఆ తరువాత వారు రాజు కావలెనని కోరగా దేవుడు బెన్యామీను గోత్రీయుడును కీషు కుమారుడునైన సౌలును వారికి నలువది ఏండ్ల వరకు దయచేసెను.
నేను ఎవనివాడనో, యెవనిని సేవించుచున్నానో, ఆ దేవుని దూత గడచిన రాత్రి నాయొద్ద నిలిచి పౌలా, భయపడకుము;
యోనాతాను ఆ మాట నీవెన్నటికిని అనుకొనవద్దు, నీవు చావవు; నాకు తెలియజేయకుండ నా తండ్రి చిన్నకార్యమే గాని పెద్దకార్యమేగాని చేయడు; నా తండ్రి ఇదెందుకు నాకు మరుగుచేయుననగా
ఇశ్రాయేలీయుల దేవా సైన్యములకధిపతియగు యెహోవా నీకు సంతానము కలుగజేయుదునని నీవు నీ దాసుడనైన నాకు తెలియపరచితివి గనుక ఈలాగున నీతో మనవి చేయుటకై నీ దాసుడనైన నాకు ధైర్యము కలిగెను.
నరులు గర్విష్ఠులు కాకుండ చేయునట్లు తాము తలచిన కార్యము వారు మానుకొన చేయునట్లు
నీ సహోదరులలోనే ఒకని నీమీద రాజుగా నియమించుకొనవలెను. నీ సహోదరుడుకాని అన్యుని నీమీద నియమించుకొనకూడదు.
దేవా నీకు సంతతి కలుగజేసెదనని నీ దాసునికి నీవు తెలియజేసియున్నావు గనుక నీ సన్నిధిని విన్నపము చేయుటకు నీ దాసునికి మనోధైర్యము కలిగెను.
సంతోషించి ఉత్సహించుదురు కాగా ప్రభువును సైన్యములకధిపతియునగు యెహోవా నాకు ప్రత్యక్షుడై నాకు వినబడునట్లు ఇట్లనుచున్నాడు మీరు మరణము కాకుండ ఈ మీ దోషమునకు ప్రాయశ్చిత్తము కలుగదని ప్రభువును సైన్యములకధిపతియునగు యెహోవా ప్రమాణ పూర్వకముగా సెలవిచ్చుచున్నాడు.
నేను వినుచుండగా వారికీలాగు సెలవిచ్చెను మీరు పట్టణములో వాని వెంటపోయి నా పరిశుద్ధ స్థలము దగ్గర మొదలుపెట్టి, కటాక్షమైనను కనికరమైనను లేకుండ అందరిని హతము చేయుడి.