లేఖనాలను అన్వేషించండి

2సమూయేలు 14: 12

క్రాస్-రిఫరెన్స్‌లు

" అప్పుడు ఆ స్త్రీనా యేలినవాడవగు నీతో ఇంకొక మాటచెప్పుకొనుట నీ దాసినగు నాకు దయచేసి సెలవిమ్మని మనవిచేయగా రాజు చెప్పుమనెను."

సంబంధిత రిఫరెన్స్‌లు

1సమూయేలు 25:24

నా యేలినవాడా, యీ దోషము నాదని యెంచుము; నీ దాసురాలనైన నన్ను మాటలాడనిమ్ము, నీ దాసురాలనైన నేను చెప్పు మాటలను ఆలకించుము;

ఆదికాండము 18:27

అందుకు అబ్రాహాము ఇదిగో ధూళియు బూడిదెయునైన నేను ప్రభువుతో మాటలాడ తెగించుచున్నాను.

ఆదికాండము 18:32

అతడు ప్రభువు కోపపడనియెడల నే నింకొకమారే మాటలాడెదను; ఒకవేళ అక్కడ పదిమంది కనబడుదురేమో అనినప్పుడు ఆయన ఆ పదిమందినిబట్టి నాశనము చేయకయుందుననెను.

ఆదికాండము 44:18

యూదా అతని సమీపించి ఏలినవాడా ఒక మనవి; ఒక మాట యేలిన వారితో తమ దాసుని చెప్పుకొననిమ్ము; తమ కోపము తమ దాసునిమీద రవులుకొననీయకుము; తమరు ఫరో అంతవారు గదా

యిర్మియా 12:1

యెహోవా, నేను నీతో వాదించునప్పుడు నీవు నీతిమంతుడవుగా కనబడుదువు; అయినను న్యాయము విధించుటనుగూర్చి నేను నీతో మాటలాడుదును; దుష్టులు తమ మార్గములలో వర్ధిల్లనేల? మహా విశ్వాసఘాతకులు సుఖింపనేల?

అపోస్తలులకార్యములు 26:1

అగ్రిప్ప పౌలును చూచి నీ పక్షమున చెప్పుకొనుటకు నీకు సెలవైనదనెను. అప్పుడు పౌలు చేయిచాచి యీలాగు సమాధానము చెప్పసాగెను

2సమూయేలు 20:17

అంతట ఆమె యోవాబువు నీవేనా అని అతని నడుగగా అతడు నేనే అనెను. అందుకామె నీ దాసురాలనగు నేను నీతో మాటలాడుదునా అని అడుగగా అతడు మాటలాడవచ్చుననెను.

1రాజులు 2:14

నీతో చెప్పవలసిన మాటయొకటి యున్నదనెను. ఆమె అది చెప్పుమనగా