2సమూయేలు 14: 29
క్రాస్-రిఫరెన్స్‌లు
" యోవాబును రాజునొద్దకు పంపించుటకై అబ్షాలోము అతనిని పిలువనంపినప్పుడు యోవాబు రానొల్లక యుండెను. రెండవమారు అతని పిలువనంపినప్పుడు అతడు రానొల్లక పోగా"
సంబంధిత రిఫరెన్స్‌లు
అబ్షాలోము తన పనివారిని పిలిచి యోవాబు పొలము నా పొలముదగ్గర నున్నది గదా, దానిలో యవల చేలు ఉన్నవి; మీరు పోయి వాటిని తగులబెట్టుడని వారితో చెప్పెను. అబ్షాలోము పనివారు ఆ చేలు తగులబెట్టగా
యావాబు చూచి లేచి అబ్షాలోము ఇంటికి వచ్చి నీ పనివారు నా చేలు తగులబెట్టిరేమని అడుగగా
రాణియైన వష్తి నపుంసకులచేత ఇయ్యబడిన రాజాజ్ఞ ప్రకారము వచ్చుటకు ఒప్పకపోగా రాజు మిగుల కోపగించెను, అతని కోపము రగులుకొనెను.
ఆ పెండ్లివిందుకు పిలువబడిన వారిని రప్పించుటకు అతడు తన దాసులను పంపినప్పుడు వారు రానొల్లకపోయిరి.
దేవునికంటె వానిని కొంచెము తక్కువవానిగా చేసియున్నావు. మహిమా ప్రభావములతో వానికి కిరీటము ధరింపజేసియున్నావు.