లేఖనాలను అన్వేషించండి

2సమూయేలు 22: 37

క్రాస్-రిఫరెన్స్‌లు

" నా పాదములకు చోటు విశాలపరచుదువు నా చీలమండలు బెణకలేదు."

సంబంధిత రిఫరెన్స్‌లు

కీర్తనలు 4:1

నా నీతికి ఆధారమగు దేవా, నేను మొఱ్ఱపెట్టునప్పుడు నాకుత్తరమిమ్ము ఇరుకులో నాకు విశాలత కలుగజేసినవాడవు నీవే నన్ను కరుణించి నా ప్రార్థన నంగీకరించుము.

కీర్తనలు 18:36

నా పాదములకు చోటు విశాలపరచితివి నా చీలమండలు బెణకలేదు.

సామెతలు 4:12

నీవు నడచునప్పుడు నీ అడుగు ఇరుకున పడదు. నీవు పరుగెత్తునప్పుడు నీ పాదము తొట్రిల్లదు.

1సమూయేలు 2:9

తన భక్తుల పాదములు తొట్రిల్లకుండ ఆయన వారిని కాపాడును దుర్మార్గులు అంధకారమందు మాటు మణుగుదురు బలముచేత ఎవడును జయము నొందడు.

కీర్తనలు 17:5

నీ మార్గములయందు నా నడకలను స్థిరపరచుకొని యున్నాను. నాకు కాలు జారలేదు.

కీర్తనలు 94:18

నాకాలు జారెనని నేననుకొనగా యెహోవా, నీ కృప నన్ను బలపరచుచున్నది.

కీర్తనలు 121:3

ఆయన నీ పాదము తొట్రిల్లనియ్యడు నిన్ను కాపాడువాడు కునుకడు.