అపోస్తలులకార్యములు 12: 19
క్రాస్-రిఫరెన్స్‌లు
" హేరోదు అతని కోసరము వెదకినప్పుడు అతడు కనబడనందున కావలివారిని విమర్శించి వారిని చంపనాజ్ఞాపించెను. అటు తరువాత హేరోదు యూదయనుండి కైసరయకు వెళ్లి అక్కడ నివసించెను."
సంబంధిత రిఫరెన్స్‌లు
బంట్రౌతులు అక్కడికి వెళ్లినప్పుడు వారు చెరసాలలో కనబడనందున తిరిగివచ్చి
చెరసాల బహు భద్రముగా మూసియుండుటయు, కావలివారు తలుపుల ముందర నిలిచియుండుటయు చూచితివిు గాని తలుపులు తీసినప్పుడు లోపల మాకొకడైనను కనబడలేదని వారికి తెలిపిరి.
అంతట దేవాలయపు అధిపతియు ప్రధానయాజకులును ఆ మాటలు విని ఇది యేమవునో అని వారి విషయమై యెటుతోచక యుండిరి.
అప్పుడు ఒకడు వచ్చి ఇదిగో మీరు చెరసాలలో వేయించిన మనుష్యులు దేవాలయములో నిలిచి ప్రజలకు బోధించుచున్నారని వారికి తెలుపగా
అంతలో చెరసాల నాయకుడు మేలుకొని, చెరసాల తలుపులన్నియు తెరచియుండుట చూచి, ఖయిదీలు పారిపోయిరనుకొని, కత్తిదూసి, తన్ను తాను చంపుకొనబోయెను.
ఆ కాలమందు క్రీస్తు మార్గమునుగూర్చి చాల అల్లరి కలిగెను.
అయితే ఆయన వారి మధ్యనుండి దాటి తన మార్గమున వెళ్లిపోయెను.
వారామాట విని, తెల్లవారగానే దేవాలయములోనికి వెళ్లి బోధించుచుండిరి. ప్రధానయాజకుడును అతనితోకూడ నున్నవారును వచ్చి, మహా సభవారిని ఇశ్రాయేలీయుల పెద్దలనందరిని పిలువనంపించి వారిని తోడుకొనిరండని బంట్రౌతులను చెరసాలకు పంపిరి.
వారు చాల దెబ్బలు కొట్టి వారిని చెరసాలలో వేసి భద్రముగా కనిపెట్టవలెనని చెరసాల నాయకునికాజ్ఞాపించిరి.