లేఖనాలను అన్వేషించండి

అపోస్తలులకార్యములు 21: 11

క్రాస్-రిఫరెన్స్‌లు

" అతడు మాయొద్దకు వచ్చి పౌలు నడికట్టు తీసికొని, తనచేతులను కాళ్లను కట్టుకొని యెరూషలేములోని యూదులు ఈ నడికట్టుగల మనుష్యుని ఈలాగు బంధించి, అన్యజనులచేతికి అప్పగింతురని పరిశుద్దాత్మ చెప్పుచున్నాడనెను"

సంబంధిత రిఫరెన్స్‌లు

అపోస్తలులకార్యములు 21:4

మేమక్కడనున్న శిష్యులను కనుగొని యేడు దినములక్కడ ఉంటిమి. వారు నీవు యెరూషలేములో కాలుపెట్టవద్దని ఆత్మ ద్వారా పౌలుతో చెప్పిరి.

అపోస్తలులకార్యములు 21:7

మేము తూరునుండి చేసిన ప్రయాణము ముగించి, తొలెమాయికి వచ్చి, సహోదరులను కుశలమడిగి వారియొద్ద ఒక దినముంటిమి.

అపోస్తలులకార్యములు 20:16

సాధ్యమైతే పెంతెకొస్తు దినమున యెరూషలేములో ఉండవలెనని పౌలు త్వరపడుచుండెను గనుక అతడు ఆసియలో కాలహరణము చేయకుండ ఎఫెసును దాటిపోవలెనని నిశ్చయించుకొని యుండెను.

అపోస్తలులకార్యములు 11:28

వారిలో అగబు అను ఒకడు నిలువబడి, భూలోకమంతట గొప్ప కరవు రాబోవుచున్నదని ఆత్మద్వారా సూచించెను. అది క్లౌదియ చక్రవర్తి కాలమందు సంభవించెను.

1కొరిందీయులకు 12:10

మరియొకనికి అద్భుతకార్యములను చేయు శక్తియు, మరియొకనికి ప్రవచన వరమును, మరియొకనికి ఆత్మల వివేచనయు, మరియొకనికి నానావిధ భాషలును, మరి యొకనికి భాషల అర్థము చెప్పు శక్తియు అనుగ్రహింపబడియున్నవి.