లేఖనాలను అన్వేషించండి

అపోస్తలులకార్యములు 21: 13

క్రాస్-రిఫరెన్స్‌లు

" పౌలు ఇదెందుకు? మీరు ఏడ్చి నా గుండె బద్దలు చేసెదరేల? నేనైతే ప్రభువైన యేసు నామము నిమిత్తము యెరూషలేములో బంధింపబడుటకు మాత్రమే గాక చనిపోవుటకును సిద్ధముగా ఉన్నానని చెప్పెను."

సంబంధిత రిఫరెన్స్‌లు

అపోస్తలులకార్యములు 21:4

మేమక్కడనున్న శిష్యులను కనుగొని యేడు దినములక్కడ ఉంటిమి. వారు నీవు యెరూషలేములో కాలుపెట్టవద్దని ఆత్మ ద్వారా పౌలుతో చెప్పిరి.

అపోస్తలులకార్యములు 20:22

ఇదిగో నేనిప్పుడు ఆత్మయందు బంధింపబడినవాడనై యెరూషలేమునకు వెళ్లుచున్నాను, అక్కడ నాకు ఏమేమి సంభవించునో తెలియదుగాని,

మత్తయి 16:21

అప్పటినుండి తాను యెరూషలేమునకు వెళ్లి పెద్దలచేతను ప్రధాన యాజకులచేతను శాస్త్రులచేతను అనేక హింసలు పొంది, చంపబడి, మూడవ దినమున లేచుట అగత్యమని యేసు తన శిష్యులకు తెలియజేయ మొదలుపెట్టగా

మత్తయి 16:22

పేతురు ఆయన చేయి పట్టుకొని ప్రభువా, అది నీకు దూరమగుగాక, అది నీకెన్నడును కలుగదని ఆయనను గద్దింపసాగెను.

మత్తయి 16:23

అయితే ఆయన పేతురువైపు తిరిగి సాతానా, నా వెనుకకు పొమ్ము; నీవు నాకు అభ్యంతరకారణమై యున్నావు; నీవు మనుష్యుల సంగతులనే తలంచుచున్నావు గాని దేవుని సంగతులను తలంపక యున్నావని పేతురుతో చెప్పెను

యోహాను 11:8

ఆయన శిష్యులు బోధకుడా, యిప్పుడే యూదులు నిన్ను రాళ్లతో కొట్ట చూచుచుండిరే; అక్కడికి తిరిగివెళ్లుదువా అని ఆయన నడిగిరి.

అపోస్తలులకార్యములు 19:31

మరియు ఆసియ దేశాధికారులలో కొందరు అతనికి స్నేహితులైయుండి అతని యొద్దకు వర్తమానము పంపి నీవు నాటకశాలలోనికి వెళ్లవద్దని అతని వేడుకొనిరి.