ద్వితియోపదేశాకాండము 23: 17
క్రాస్-రిఫరెన్స్‌లు
" ఇశ్రాయేలు కుమార్తెలలో ఎవతెయు వేశ్యగా ఉండకూడదు. ఇశ్రాయేలు కుమారులలో ఎవడును పురుషగామిగా ఉండకూడదు."
సంబంధిత రిఫరెన్స్‌లు
వారు ఆమె తండ్రి యింటియొద్దకు ఆ చిన్నదానిని తీసికొనిరావలెను. అప్పుడు ఆమె ఊరి వారు ఆమెను రాళ్లతో చావగొట్టవలెను. ఏలయనగా ఆమె తన తండ్రియింట వ్యభిచరించి ఇశ్రాయేలీయులలో దుష్కార్యము చేసెను. అట్లు ఆ చెడుతనమును మీ మధ్యనుండి మీరు పరిహరించుదురు.
ఆమెతో శయనించినవాడు ఆ చిన్నదాని తండ్రికి ఏబది వెండిరూకలిచ్చి ఆమెను పెండ్లిచేసికొనవలెను. అతడు ఆమెను ఆవమానపరచెను గనుక అతడు తాను బ్రదుకు దినములన్నిటను ఆమెను విడిచిపెట్టకూడదు.
మీ దేశము వ్యభిచరింపకయు దుష్కామ ప్రవర్తనతో నిండకయు ఉండునట్లు నీ కుమార్తె వ్యభిచారిణియగుటకై ఆమెను వేశ్యగా చేయకూడదు.
మరియు అది జారస్త్రీనుండి మృదువుగా మాటలాడు పరస్త్రీనుండి నిన్ను రక్షించును.
అందువలన దేవుడు తుచ్ఛమైన అభిలాషలకు వారిని అప్పగించెను. వారి స్త్రీలు సయితము స్వాభావికమైన ధర్మమును విడిచి స్వాభావిక విరుద్ధమైన ధర్మమును అనుసరించిరి.
వారు పండుకొనకముందు ఆ పట్టణస్థులు, అనగా సొదొమ మనుష్యులు, బాలురును వృద్ధులును ప్రజలందరును నలుదిక్కులనుండి కూడివచ్చి ఆ యిల్లు చుట్టవేసి
లోతును పిలిచి ఈ రాత్రి నీయొద్దకు వచ్చిన మనుష్యులు ఎక్కడ? మేము వారిని కూడునట్లు మాయొద్దకు వారిని వెలుపలికి తీసికొని రమ్మని అతనితో చెప్పగా
వారు సంతోషించుచుండగా ఆ ఊరివారిలో కొందరు పోకిరులు ఆ యిల్లు చుట్టుకొని తలుపుకొట్టినీ యింటికి వచ్చిన మనుష్యుని మేము ఎరుగునట్లు అతని బయటికి తెమ్మని యింటి యజమానుడైన ఆ ముసలివానితో అనగా
మరియు పురుషగాములు సహా దేశమందుండిరి. ఇశ్రాయేలీయులయెదుట నిలువకుండ యెహోవా వెళ్లగొట్టిన జనులు చేయు హేయక్రియల ప్రకారముగా యూదావారును చేయుచు వచ్చిరి.
పురుషగాములను దేశములోనుండి వెళ్లగొట్టి తన పితరులు చేయించిన విగ్రహములన్నిటిని పడగొట్టెను.
తన తండ్రియైన ఆసా దినములలో శేషించియుండిన పురుషగాములను అతడు దేశములోనుండి వెళ్లగొట్టెను.
మరియు యెహోవా మందిరమందున్న పురుషగాముల యిండ్లను పడగొట్టించెను. అచ్చట అషేరాదేవికి గుళ్లను అల్లు స్త్రీలు వాసము చేయుచుండిరి.
అటువలె పురుషులు కూడ స్త్రీయొక్క స్వాభావికమైన ధర్మమును విడిచి, పురుషులతో పురుషులు అవాచ్యమైనది చేయుచు, తమ తప్పిదమునకు తగిన ప్రతిఫలమును పొందుచు ఒకరియెడల ఒకరు కామతప్తులైరి
మరియు వారు తమ మనస్సులో దేవునికి చోటియ్యనొల్లకపోయిరి గనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్టమనస్సుకు వారినప్పగించెను.
అన్యాయస్థులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరరని మీకు తెలియదా? మోసపోకుడి; జారులైనను విగ్రహారాధకులైనను వ్యభిచారులైనను ఆడంగితనము గలవారైనను పురుష సంయోగులైనను
హితబోధకు విరోధియైనవాడు మరి ఎవడైనను ఉండినయెడల, అట్టివానికిని నియమింపబడెనుగాని,
అన్నలారా, ఇంత పాతకము కట్టుకొనకుడి;
యాకోబు కుమారులు ఆ సంగతి విని పొలములోనుండి వచ్చిరి. అతడు యాకోబు కుమార్తెతో శయనించి ఇశ్రాయేలు జనములో అవమానకరమైన కార్యము చేసెను; అది చేయరాని పని గనుక ఆ మనుష్యులు సంతాపము పొందిరి, వారికి మిగుల కోపము వచ్చెను.
ఒకడు స్త్రీతో శయనించినట్టు పురుషునితో శయనించినయెడల వారిద్దరు హేయక్రియను చేసిరిగనుక వారికి మరణశిక్ష విధింపవలెను; తమ శిక్షకు తామే కారకులు.
తరువాత వేశ్యలైన యిద్దరు స్త్రీలు రాజునొద్దకు వచ్చి అతని ముందర నిలిచిరి.
కావున వారు యౌవనమందే మృతినొందుదురు వారి బ్రదుకు పురుషగాముల బ్రదుకువంటిదగును.
నీ విటకాండ్రు నలుదిక్కులనుండి వచ్చి నీతో వ్యభిచరించునట్లు వారికందరికి నీవే సొమ్మిచ్చుచు వచ్చితివి, బహుమానముల నిచ్చుచు వచ్చితివి.
వారు అహంకరించి నా దృష్టికి హేయక్రియలు చేసిరి గనుక నేను దాని చూచి వారిని వెళ్లగొట్టితిని.
మీలో జారత్వమే గాని, యే విధమైన అపవిత్రతయే గాని, లోభత్వమేగాని, వీటి పేరైనను ఎత్తకూడదు, ఇదే పరిశుద్ధులకు తగినది.