లేఖనాలను అన్వేషించండి

యెహెజ్కేలు 27: 35

క్రాస్-రిఫరెన్స్‌లు

" నిన్నుబట్టి ద్వీపనివాసులందరు విభ్రాంతి నొందుదురు, వారి రాజులు వణకుదురు, వారి ముఖములు చిన్నబోవును."

సంబంధిత రిఫరెన్స్‌లు

యెహెజ్కేలు 27:26

నీ కోలలు వేయువారు మహాసముద్రములోనికి నిన్ను త్రోయగా తూర్పు గాలి సముద్రమధ్యమందు నిన్ను బద్దలుచేయును.

యెహెజ్కేలు 27:27

అప్పుడు నీ ధనమును నీ సరకులును నీవు బదులిచ్చు వస్తువులును నీ నావికులును నీ ఓడనాయకులును నీ ఓడలు బాగుచేయువారును నీతో వర్తకము చేయువారును నీలో నున్న సిపాయిలందరును నీలోనున్న జనసమూహములన్నియు నీవు కూలు దినమందే సముద్రమధ్యమందు కూలుదురు.

యెహెజ్కేలు 26:12

వారు నీ ఐశ్వర్యమును దోచుకొందురు, నీ వర్తకమును అపహరింతురు, నీ ప్రాకారములను పడగొట్టుదురు, నీ విలాస మందిరములను పాడుచేయుదురు, నీ రాళ్లను నీ కలపను నీ మంటిని నీళ్లలో ముంచివేయుదురు.

యెహెజ్కేలు 26:13

ఇట్లు నేను నీ సంగీతనాదమును మాన్పించెదను, నీ సితారానాద మికను వినబడదు,

యెహెజ్కేలు 26:14

నిన్ను వట్టిబండగా చేయుదును, వలలు పరచుకొనుటకు చోటగుదువు నీవికను కట్టబడక యుందువు. నేనే మాట యిచ్చియున్నాను; ఇదే ప్రభువగు యెహోవా వాక్కు.

యెహెజ్కేలు 26:15

తూరునుగూర్చి ప్రభువగు యెహోవా సెలవిచ్చునదేమనగా నీవు కూలునప్పుడు కలుగు ధ్వనియు, హతులగుచున్నవారి కేకలును, నీలో జరుగు గొప్పవధయు ద్వీపములు విని కంపించును.

యెహెజ్కేలు 26:19

ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా నివాసులులేని పట్టణములవలెనే నేను నిన్ను పాడుచేయునప్పుడు మహా సముద్రము నిన్ను ముంచునట్లుగా నీ మీదికి నేను అగాధజలములను రప్పించెదను, పురాతన కాలమందు పాతాళములోనికి దిగిపోయినవారియొద్ద నీవుండునట్లు నేను నిన్ను పడవేసి, నీవు జనములేని దానవగుటకై పురాతనకాలములో పాడైన జనులయొద్ద భూమి క్రిందనున్న స్థలములలో నీకు నివాసము నిర్ణయింతును, పాతాళములోనికి దిగిపోవువారితో కూడ నిన్ను నివసింపజేసెదను.

యెహెజ్కేలు 26:20

మరియు సజీవులు నివసించు భూమిమీద నేను మహాఘనకార్యము కలుగజేతును;

యెహెజ్కేలు 26:21

నిన్ను భీతికి కారణముగా జేతును, నీవు లేకపోవుదువు, ఎంత వెదకినను నీవెన్నటికిని కనబడకయుందువు; ఇదే ప్రభువైన యెహోవా వాక్కు.

జెకర్యా 9:3

తూరు పట్టణపువారు ప్రాకారముగల కోటను కట్టుకొని, యిసుక రేణువులంత విస్తారముగా వెండిని, వీధులలోని కసువంత విస్తారముగా సువర్ణమును సమకూర్చుకొనిరి.

జెకర్యా 9:4

యెహోవా సముద్రమందుండు దాని బలమును నాశనముచేసి దాని ఆస్తిని పరులచేతికప్పగించును, అది అగ్నిచేత కాల్చబడును.

నిర్గమకాండము 15:5

అగాధజలములు వారిని కప్పెను వారు రాతివలె అడుగంటిపోయిరి.

యెషయా 23:11

ఆయన సముద్రముమీద తన చెయ్యి చాపెను రాజ్యములను కంపింపజేసెను కనాను కోటలను నశింపజేయుటకు యెహోవా దానిగూర్చి ఆజ్ఞాపించెను.

యెహెజ్కేలు 28:8

నిన్ను పాతాళములో పడవేతురు, సముద్రములో మునిగి చచ్చినవారివలెనే నీవు చత్తువు.

అపోస్తలులకార్యములు 27:41

రెండు ప్రవాహములు కలిసిన స్థలమందు చిక్కుకొని ఓడను మెట్ట పట్టించిరి. అందువలన అనివి కూరుకొనిపోయి కదలక యుండెను, అమరము ఆ దెబ్బకు బద్దలైపోసాగెను.

ప్రకటన 18:23

దీపపు వెలుగు నీలో ఇకను ప్రకాశింపనే ప్రకాశింపదు, పెండ్లికుమారుని స్వరమును పెండ్లికుమార్తె స్వరమును నీలో ఇక ఎన్నడును వినబడవు అని చెప్పెను.