యెహెజ్కేలు 27: 5
క్రాస్-రిఫరెన్స్‌లు
" నీ ఓడలను శెనీరు దేశపు సరళవృక్షపు మ్రానుతో కట్టుదురు, లెబానోను దేవదారు మ్రాను తెప్పించి నీ ఓడకొయ్యలు చేయుదురు."
సంబంధిత రిఫరెన్స్‌లు
సముద్రము దాని నావరించును, అది వలలు పరచుటకు చోటగును, నేనేమాట యిచ్చితిని, ఇదే ప్రభువగు యెహోవా వాక్కు అది జనములకు దోపుడుసొమ్మగును.
సముద్రతీరవాసులారా, అంగలార్చుడి సముద్రము దాటుచుండు సీదోను వర్తకులు తమ సరకులతో నిన్ను నింపిరి.
సముద్రపు రేవులమీద నివసించుదానా, అనేక ద్వీపములకు ప్రయాణముచేయు వర్తకజనమా, ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా తూరు పట్టణమా నేను సంపూర్ణ సౌందర్యము కలదాననని నీవనుకొనుచున్నావే;
అర్వదు వారు నీ సైన్యములో చేరి చుట్టు నీ ప్రాకారములకు డాళ్లు తగిలించి చుట్టు నీ ప్రాకారములమీద కావలి కాచి నీ సౌందర్యమును సంపూర్ణ పరచెదరు.
తర్షీషు ఓడలు నీకు బండ్లుగా ఉన్నవి. నీవు పరిపూర్ణమైనదానవై మహాఘనముగా సముద్రముమీద కూర్చున్నావు.
నరపుత్రుడా, తూరు అధిపతితో ఈలాగు ప్రకటింపుము ప్రభువగు యెహోవా సెలవిచ్చునదేమనగా గర్విష్ఠుడవై నేనొక దేవతను, దేవతనైనట్టు సముద్రము మధ్యను నేను ఆసీనుడనై యున్నాను అని నీవనుకొనుచున్నావు; నీవు దేవుడవు కాక మానవుడవై యుండియు దేవునికి తగినంత అభిప్రాయము కలిగియున్నావు, నీవు దానియేలునకంటె జ్ఞానవంతుడవు, నీకు మర్మమైనదేదియు లేదు.
నరపుత్రుడా, తూరు రాజునుగూర్చి అంగలార్పువచనమెత్తి ఈలాగు ప్రకటింపుము ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా పూర్ణజ్ఞానమును సంపూర్ణ సౌందర్యమునుగల కట్టడమునకు మాదిరివి
నీవు నియమింపబడిన దినము మొదలుకొని పాపము నీయందు కనబడువరకు ప్రవర్తన విషయములో నీవు యథార్థవంతుడవుగా ఉంటివి.
సౌందర్యమందు నీవు ఎవనిని మించినవాడవు? దిగి సున్నతినొందని వారియొద్ద పడియుండుము.