యెహెజ్కేలు 46: 15
క్రాస్-రిఫరెన్స్‌లు
" గొఱ్ఱపిల్లలను నైవేద్యమును నూనెను అనుదినము ఉదయముననే నిత్యదహనబలిగా అర్పింపవలెను."
సంబంధిత రిఫరెన్స్‌లు
దంచితీసిన మూడు పళ్లలోనిది పావు నూనెతో కలుపబడిన తూమెడు పిండిలో పదియవవంతు నైవేద్యము చేయవలెను.
కాబట్టి యీ దినము మీకు జ్ఞాపకార్థమైనదగును. మీరు యెహోవాకు పండుగగా దాని నాచరింపవలెను; తరతరములకు నిత్యమైన కట్టడగా దాని నాచరింపవలెను.
దంచి తీసిన ముప్పావు నూనెతో కలిపిన పదియవవంతు పిండిని పానీయార్పణముగా ముప్పావు ద్రాక్షారసమును మొదటి గొఱ్ఱపిల్లతో అర్పింపవలెను. సాయంకాలమందు రెండవ గొఱ్ఱపిల్లను అర్పింపవలెను.
దాని నైవేద్యము నూనెతో కలిసిన రెండు పదియవ వంతుల గోధుమపిండి. అది యెహోవాకు ఇంపైన సువాసనగల హోమము. దాని పానార్పణము ముప్పావు ద్రాక్షారసము.
యెహోవాకు ఆ అర్పణము నర్పించువాడు ముప్పావు నూనెతో కలుపబడిన రెండు పళ్ల పిండిని నైవేద్యముగా తేవలెను.
అది యెహోవాకు ఇంపైన సువాసనగల హోమముగా సీనాయి కొండమీద నియమింపబడిన నిత్యమైన దహనబలి.
ఆ సైన్యము యొక్క అధిపతికి విరోధముగా తన్ను హెచ్చించుకొని, అనుదిన బల్యర్పణమును నిలిపివేసి ఆయన ఆలయమును పడద్రోసెను.