యెహెజ్కేలు 46: 6
క్రాస్-రిఫరెన్స్‌లు
" అమావాస్యనాడు నిర్దోషమైన చిన్న కోడెను నిర్దోషమైన ఆరు గొఱ్ఱ పిల్లలను నిర్దోషమైన యొక పొట్టేలును అర్పింపవలెను."
సంబంధిత రిఫరెన్స్‌లు
నైవేద్యమును సిద్ధపరచవలెను, ఎద్దుతోను పొట్టేలుతోను తూమెడు పిండిని గొఱ్ఱపిల్లలతో శక్తికొలది పిండిని అర్పింపవలెను, తూము ఒకటింటికి మూడు పళ్ల నూనె నైవేద్యము చేయవలెను.
పండుగదినములలోను నియామక కాలములలోను ఎద్దుతోగాని పొట్టేలుతోగాని తూమెడు పిండియు, గొఱ్ఱపిల్లలతో శక్తికొలది పిండియు, తూము ఒకటింటికి మూడుపళ్ల నూనెయు నైవేద్యముగా అర్పింపవలెను.
యెహోవాకు స్వేచ్ఛార్పణమైన దహనబలినైనను స్వేచ్ఛార్పణమైన సమాధానబలినైనను అధిపతి యర్పించునప్పుడు తూర్పుతట్టు గుమ్మము తీయవలెను; విశ్రాంతిదినమున అర్పించునట్లు దహనబలిని సమాధానబలిని అర్పించి వెళ్లిపోవలెను; అతడు వెళ్లిపోయిన తరువాత గుమ్మము మూయబడవలెను.
మరియు ఎద్దొకటింటికిని పొట్టేలొకటింటికిని తూము పిండిపట్టిన నైవేద్యము చేయవలెను. తూము ఒకటింటికి మూడు పళ్ల నూనె యుండవలెను.
నూనెతో కలుపబడిన తూమెడు పిండిలో మూడు పదియవవంతులను నైవేద్యముగాను ఒక్కొక్క పొట్టేలుతోను, నూనెతో కలపబడి తూమెడు పిండిలో రెండు పదియవవంతులను నైవేద్యముగాను, ఒక్కొక్క గొఱ్ఱపిల్లతో నూనెతో కలపబడిన తూమెడు పిండిలో నొక పదియవవంతును నైవేద్యముగాను చేయవలెను.
వాడు బీదవాడై పైచెప్పినదంతయు తేజాలనియెడల తన నిమిత్తము ప్రాయశ్చిత్తము కలుగుటకై వాడు అల్లాడించుటకు అపరాధపరిహారార్థబలిగా ఒక గొఱ్ఱపిల్లను నైవేద్యముగా తూములో పదియవవంతు నూనెతో కలిసిన గోధుమపిండిని ఒక అర్ధసేరు నూనెను
మ్రొక్కుకొనిన నాజీరు తన కలిమికొలది ఇచ్చుదాని గూర్చిన విధియు, అతడు నాజీరైయున్నందున యెహోవాకు అర్పింపవలసిన దానిగూర్చిన విధియు ఇదే. తాను మ్రొక్కుకొనిన మ్రొక్కుబడి చొప్పున నాజీరును గూర్చిన విధినిబట్టి ఇదియంతయు చేయవలెనని చెప్పుము.
వారు వట్టిచేతులతో యెహోవా సన్నిధిని కనబడక, నీ దేవుడైన యెహోవా నీకనుగ్రహించిన దీవెనచొప్పున ప్రతివాడును తన శక్తికొలది యియ్యవలెను.
దంచి తీసిన ముప్పావు నూనెతో కలిపిన పదియవవంతు పిండిని పానీయార్పణముగా ముప్పావు ద్రాక్షారసమును మొదటి గొఱ్ఱపిల్లతో అర్పింపవలెను. సాయంకాలమందు రెండవ గొఱ్ఱపిల్లను అర్పింపవలెను.
ఆ కోడెతో కూడ పడిన్నర నూనె కలుపబడిన ఆరు పళ్ల గోధుమ పిండిని నైవేద్యముగా అర్పింపవలెను.
నిత్యమైన దహనబలియు దాని పానార్పణమును గాక యిది ప్రతి విశ్రాంతిదినమున చేయవలసిన దహనబలి.