లేఖనాలను అన్వేషించండి

యెహెజ్కేలు 46: 9

క్రాస్-రిఫరెన్స్‌లు

" అయితే దేశజనులు నియామక కాలములయందు యెహోవా సన్నిధిని ఆరాధన చేయుటకై వచ్చునప్పుడు ఉత్తరపు గుమ్మపు మార్గముగా వచ్చినవారు దక్షిణపు గుమ్మపు మార్గముగా వెళ్లవలెను, దక్షిణపు గుమ్మపు మార్గముగా వచ్చినవారు ఉత్తరపు గుమ్మపు మార్గముగా వెళ్ళవలెను. తాము వచ్చిన దారినే యెవరును తిరిగిపోక అందరును తిన్నగా వెలుపలికిపోవలెను."

సంబంధిత రిఫరెన్స్‌లు

యెహెజ్కేలు 46:2

అధిపతి బయట మంటపమునకు పోవుమార్గముగా ప్రవేశించి, గుమ్మపు ద్వారబంధముల దగ్గర నిలువబడగా, యాజకులు దహనబలిపశువులను సమాధానబలిపశువులను అతనికి సిద్ధపరచవలెను; అతడు గుమ్మముదగ్గర నిలువబడి ఆరాధనచేసిన తరువాత వెలుపలికిపోవును, అయితే సాయంకాలము కాకమునుపే గుమ్మము మూయకూడదు.

యెహెజ్కేలు 44:1

తూర్పుతట్టు చూచు పరిశుద్ధస్థలముయొక్క బయటి గుమ్మపు మార్గమునకు అతడు నన్ను తోడుకొని రాగా ఆ గుమ్మము మూయబడియుండెను.

యెహెజ్కేలు 44:2

అంతట యెహోవా నాతో ఈ మాట సెలవిచ్చెను ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా ఈ గుమ్మముద్వారా ప్రవేశించెను గనుక ఏ మానవుడును దానిద్వారా ప్రవేశింపకుండునట్లు ఎన్నడును తీయబడకుండ అది మూయబడియే యుండును.

యెహెజ్కేలు 44:3

అధిపతియగువాడు తన ఆధిపత్యమునుబట్టి యెహోవా సన్నిధిని ఆహారము భుజించునప్పుడు అతడచ్చట కూర్చుండును; అతడైతే మంటప మార్గముగా ప్రవేశించి మంటపమార్గముగా బయటికిపోవలెను.

కొలొస్సయులకు 1:18

సంఘము అను శరీరమునకు ఆయనే శిరస్సు; ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యము కలుగు నిమిత్తము, ఆయన ఆదియైయుండి మృతులలోనుండి లేచుటలో ఆదిసంభూతుడాయెను.

యెహెజ్కేలు 44:3

అధిపతియగువాడు తన ఆధిపత్యమునుబట్టి యెహోవా సన్నిధిని ఆహారము భుజించునప్పుడు అతడచ్చట కూర్చుండును; అతడైతే మంటప మార్గముగా ప్రవేశించి మంటపమార్గముగా బయటికిపోవలెను.

యెహెజ్కేలు 46:12

యెహోవాకు స్వేచ్ఛార్పణమైన దహనబలినైనను స్వేచ్ఛార్పణమైన సమాధానబలినైనను అధిపతి యర్పించునప్పుడు తూర్పుతట్టు గుమ్మము తీయవలెను; విశ్రాంతిదినమున అర్పించునట్లు దహనబలిని సమాధానబలిని అర్పించి వెళ్లిపోవలెను; అతడు వెళ్లిపోయిన తరువాత గుమ్మము మూయబడవలెను.