లేఖనాలను అన్వేషించండి

ఆదికాండము 10: 21

క్రాస్-రిఫరెన్స్‌లు

" మరియు ఏబెరు యొక్క కుమారులందరికి పితరుడును, పెద్దవాడయిన యాపెతు సహోదరుడునగు షేముకు కూడ సంతానము పుట్టెను."

సంబంధిత రిఫరెన్స్‌లు

ఆదికాండము 9:26

మరియు అతడు షేము దేవుడైన యెహోవా స్తుతింపబడును గాక కనాను అతనికి దాసుడగును.

ఆదికాండము 11:10

షేము వంశావళి ఇది. షేము నూరేండ్లు గలవాడై జలప్రవాహము గతించిన రెండేండ్లకు అర్పక్షదును కనెను.

ఆదికాండము 11:11

షేము అర్పక్షదును కనిన తరువాత ఐదువందల యేండ్లు బ్రదికి కుమారులను కుమార్తెలను కనెను.

ఆదికాండము 11:12

అర్పక్షదు ముప్పది యైదేండ్లు బ్రదికి షేలహును కనెను.

ఆదికాండము 11:13

అర్పక్షదు షేలహును కనిన తరువాత నాలుగువందల మూడేండ్లు బ్రదికి కుమారులను కుమార్తెలను కనెను.

ఆదికాండము 11:14

షేలహు ముప్పది యేండ్లు బ్రదికి ఏబెరును కనెను.

ఆదికాండము 11:15

షేలహు ఏబెరును కనిన తరువాత నాలుగువందల మూడేండ్లు బ్రదికి కుమారులను కుమార్తెలను కనెను.

ఆదికాండము 11:16

ఏబెరు ముప్పది నాలుగేండ్లు బ్రదికి పెలెగును కనెను.

ఆదికాండము 11:17

ఏబెరు పెలెగును కనిన తరువాత నాలుగువందల ముప్పది యేండ్లు బ్రదికి కుమారులను కుమార్తెలను కనెను.

ఆదికాండము 11:18

పెలెగు ముప్పది యేండ్లు బ్రదికి రయూను కనెను.

ఆదికాండము 11:19

పెలెగు రయూను కనిన తరువాత రెండువందల తొమ్మిది యేండ్లు బ్రదికి కుమారులను కుమార్తెలను కనెను.

ఆదికాండము 11:20

రయూ ముప్పది రెండేండ్లు బ్రదికి సెరూగును కనెను.

ఆదికాండము 11:21

రయూ సెరూగును కనిన తరువాత రెండువందల ఏడేండ్లు బ్రదికి కుమారులను కుమార్తెలను కనెను.

ఆదికాండము 11:22

సెరూగు ముప్పది యేండ్లు బ్రదికి నాహోరును కనెను.

ఆదికాండము 11:23

సెరూగు నాహోరును కనిన తరువాత రెండువందల యేండ్లు బ్రదికి కుమారులను కుమార్తెలను కనెను.

ఆదికాండము 11:24

నాహోరు ఇరువది తొమ్మిది యేండ్లు బ్రదికి తెరహును కనెను.

ఆదికాండము 11:25

నాహోరు తెరహును కనిన తరువాత నూటపందొమ్మిది యేండ్లు బ్రదికి కుమారులను కుమార్తెలను కనెను.

ఆదికాండము 11:26

తెరహు డెబ్బది యేండ్లు బ్రదికి అబ్రామును నాహోరును హారానును కనెను.

సంఖ్యాకాండము 24:24

కిత్తీము తీరమునుండి ఓడలు వచ్చును. అవి అష్షూరును ఏబెరును బాధించును. కిత్తీయులుకూడ నిత్యనాశనము పొందుదురనెను.

ఆదికాండము 10:2

యాపెతు కుమారులు గోమెరు మాగోగు మాదయి యావాను తుబాలు మెషెకు తీరసు అనువారు.

ఆదికాండము 5:32

నోవహు ఐదువందల యేండ్లు గలవాడై షేమును హామును యాపెతును కనెను.

ఆదికాండము 7:13

ఆ దినమందే నోవహును నోవహు కుమారులగు షేమును హామును యాపెతును నోవహు భార్యయు వారితో కూడ అతని ముగ్గురు కోడండ్రును ఆ ఓడలో ప్రవేశించిరి.

ఆదికాండము 10:25

ఏబెరుకు ఇద్దరు కుమారులు పుట్టిరి. వారిలో ఒకని పేరు పెలెగు, ఏలయనగా అతని దినములలో భూమి దేశములుగా విభాగింపబడెను. అతని సహోదరుని పేరు యొక్తాను.

ఆదికాండము 11:16

ఏబెరు ముప్పది నాలుగేండ్లు బ్రదికి పెలెగును కనెను.

ఆదికాండము 39:14

తన యింటి మనుష్యులను పిలిచి చూడుడి, అతడు మనలను ఎగతాళి చేయుటకు ఒక హెబ్రీయుని మనయొద్దకు తెచ్చియున్నాడు. నాతో శయనింపవలెనని వీడు నాయొద్దకు రాగా నేను పెద్ద కేకవేసితిని.

1దినవృత్తాంతములు 1:19

ఏబెరునకు ఇద్దరు కుమారులు పుట్టిరి, ఒకని దినములలో భూమి విభాగింపబడెను గనుక అతనికి పెలెగు అని పేరు పెట్టబడెను, అతని సహోదరుని పేరు యొక్తాను.

లూకా 3:36

షేలహు కేయినానుకు, కేయినాను అర్పక్షదుకు, అర్పక్షదు షేముకు, షేము నోవహుకు, నోవహు లెమెకుకు,