లేఖనాలను అన్వేషించండి

ఆదికాండము 14: 5

క్రాస్-రిఫరెన్స్‌లు

" పదునాలుగవ సంవత్సరమున కదొర్లాయోమెరును అతనితో కూడనున్న రాజులును వచ్చి అష్తారోత్‌ కర్నాయిములో రెఫాయీయులను హాములో జూజీయులను షావే కిర్యతాయిము మైదానములో"

సంబంధిత రిఫరెన్స్‌లు

ఆదికాండము 15:20

హిత్తీయులను పెరిజ్జీయులను రెఫాయీయులను

ద్వితియోపదేశాకాండము 3:11

రెఫాయీయులలో బాషాను రాజైన ఓగు మాత్రము మిగిలెను. అతని మంచము ఇనుప మంచము. అది అమ్మోనీయుల రబ్బాలోనున్నది గదా? దాని పొడుగు మనుష్యుని మూరతో తొమ్మిది మూరలు దాని వెడల్పు నాలుగు మూరలు.

ద్వితియోపదేశాకాండము 3:20

అనగా మీ దేవుడైన యెహోవా యొర్దాను అద్దరిని వారికిచ్చుచున్న దేశమును వారును స్వాధీనపరచుకొనువరకు, మీ భార్యలును మీ పిల్లలును మీ మందలును నేను మీకిచ్చిన పురములలో నివసింపవలెను. తరువాత మీలో ప్రతివాడును నేను మీకిచ్చిన తన తన స్వాస్థ్యమునకు తిరిగిరావలెనని మీకు ఆజ్ఞాపించితిని. మీ మందలు విస్తారములని నాకు తెలియును.

ద్వితియోపదేశాకాండము 3:22

మీ దేవుడైన యెహోవా మీ పక్షముగా యుద్ధము చేయువాడు గనుక వారికి భయపడవద్దని ఆజ్ఞాపించితిని.

2సమూయేలు 5:18

ఫలిష్తీయులు దండెత్తివచ్చి రెఫాయీము లోయలో వ్యాపింపగా

2సమూయేలు 5:22

ఫిలిష్తీయులు మరల వచ్చి రెఫాయీము లోయలో వ్యాపింపగా

2సమూయేలు 23:13

మరియు ముప్పదిమంది అధిపతులలో శ్రేష్ఠులైన ముగ్గురు కోతకాలమున అదుల్లాము గుహలోనున్న దావీదు నొద్దకు వచ్చినప్పుడు ఫిలిష్తీయులు రెఫాయీము లోయలో దండు దిగియుండిరి,

1దినవృత్తాంతములు 11:15

ముప్పదిమంది పరాక్రమశాలులలో ముఖ్యులగు ఈ ముగ్గురు అదుల్లాము అను చట్టురాతికొండ గుహలోనుండు దావీదు నొద్దకు వచ్చిరి, ఫిలిష్తీయుల సమూహము రెఫాయీయుల లోయలో దిగియుండెను.

1దినవృత్తాంతములు 14:9

ఫిలిష్తీయులు వచ్చి రెఫాయీముల లోయలో దిగిరి.

యెషయా 17:5

చేను కోయువాడు దంట్లు పట్టుకొనగా వాని చెయ్యి వెన్నులను కోయునట్లుండును రెఫాయీము లోయలో ఒకడు పరిగె యేరునట్లుండును

ద్వితియోపదేశాకాండము 1:4

నలుబదియవ సంవత్సరములో పదకొండవ నెల మొదటి తేదిని మోషే ఇశ్రాయేలీయులకు బోధించుటకై యెహోవా తనకాజ్ఞాపించినదంతయు వారితో చెప్పెను.

యెహోషువ 12:4

ఇశ్రాయేలీయులు బాషానురాజైన ఓగుదేశమును పట్టు కొనిరి. అతడు రెఫాయీయుల శేషములో నొకడు. అతడు అష్తారోతులోను ఎద్రెయిలోను నివసించి గెషూరీ యుల యొక్కయు మాయకాతీయుల యొక్కయు సరి హద్దువరకు బాషాను అంతటిలోను సల్కాలోను

యెహోషువ 13:12

రెఫాయీయుల శేషములో అష్తారోతు లోను ఎద్రెయీలోను ఏలికయైన ఓగురాజ్యమంతయు మిగిలియున్నది. మోషే ఆ రాజులను జయించి వారి దేశమును పట్టుకొనెను.

యెహోషువ 13:31

గిలాదులో సగ మును, అష్తారోతు ఎద్రయియునను బాషానులో ఓగు రాజ్య పట్టణములును మనష్షే కుమారుడైన మాకీరు, అనగా మాకీరీయులలో సగముమందికి వారి వంశములచొప్పున కలిగినవి.

ద్వితియోపదేశాకాండము 2:20

అదియు రెఫాయీయుల దేశమని యెంచబడుచున్నది. పూర్వమందు రెఫాయీయులు అందులో నివసించిరి. అమ్మోనీయులు వారిని జంజుమ్మీయులందురు.

ద్వితియోపదేశాకాండము 2:21

వారు అనాకీయులవలె ఉన్నతదేహులు, బలవంతులైన బహు జనులు. అయితే యెహోవా అమ్మోనీయుల యెదుటనుండి వారిని వెళ్లగొట్టెను గనుక అమ్మోనీయులు వారి దేశమును స్వాధీనపరచుకొని వారిచోట నివసించిరి.

ద్వితియోపదేశాకాండము 2:22

అట్లు ఆయన శేయీరులో నివసించు ఏశావు సంతానముకొరకు చేసెను. ఎట్లనగా ఆయన వారి యెదుటనుండి హోరీయులను నశింపజేసెను గనుక వారు హోరీయుల దేశమును స్వాధీనపరచుకొని నేటివరకు వారిచోట నివసించుచున్నారు.

ద్వితియోపదేశాకాండము 2:23

గాజావరకు గ్రామములలో నివసించిన ఆవీయులను కఫ్తోరులోనుండి బయలుదేరి వచ్చిన కఫ్తారీయులు నశింపజేసి వారిచోట నివసించిరి.

1దినవృత్తాంతములు 4:40

మంచి బలకరమైన మేతయు నెమ్మదియు సుఖమునుగల విశాలదేశమును కనుగొనిరి; పూర్వమందు హాముయొక్క వంశపువారు అక్కడ కాపురముండిరి.

కీర్తనలు 78:51

ఐగుప్తులోని జ్యేష్ఠులనందరిని హాము గుడారములలోనున్న బలప్రారంభమైన ప్రథమసంతానమును ఆయన సంహరించెను.

కీర్తనలు 105:23

ఇశ్రాయేలు ఐగుప్తులోనికి వచ్చెను యాకోబు హాము దేశమందు పరదేశిగా నుండెను.

కీర్తనలు 105:27

వారు ఐగుప్తీయుల మధ్యను ఆయన సూచక క్రియలను హాము దేశములో మహత్కార్యములను జరిగించిరి

కీర్తనలు 106:22

ఎఱ్ఱసముద్రమునొద్ద భయము పుట్టించు క్రియలను చేసిన తమ రక్షకుడైన దేవుని మరచిపోయిరి.

ద్వితియోపదేశాకాండము 2:10

పూర్వకాలమున ఏమీయులనువారు ఆరు దేశములో నివసించిరి. వారు అనాకీయులవలె, ఉన్నతదేహులు, బలవంతులైన బహు జనులు. వారును అనాకీయులవలె రెఫాయీయులుగా ఎంచబడినవారు.

ద్వితియోపదేశాకాండము 2:11

మోయాబీయులు వారికి ఏమీయులని పేరు పెట్టిరి.

యెహోషువ 13:19

కిర్యతాయిము సిబ్మాలోయలోని కొండమీది శెరెత్షహరు బెత్పయోరు పిస్గాకొండచరియలు

యిర్మియా 48:1

మోయాబును గూర్చినది. ఇశ్రాయేలు దేవుడగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు. నెబోకు శ్రమ, అది పాడైపోవుచున్నది. కిర్యతాయిము పట్టబడినదై అవమానము నొందుచున్నది ఎత్తయిన కోట పడగొట్టబడినదై అవమానము నొందుచున్నది ఇకను మోయాబునకు ప్రసిద్ధియుండదు.

యిర్మియా 48:23

బేత్మెయోనునకును కెరీయోతునకును బొస్రాకును దూరమైనట్టియు సమీపమైనట్టియు

యెహోషువ 17:15

యెహోషువమీరు గొప్ప జనము గనుక ఎఫ్రాయిమీయులయొక్క మన్యము మీకు ఇరుకుగా నున్నయెడల మీరు అడవికి పోయి అక్కడ పెరిజ్జీయుల దేశములోను రెఫాయీయుల దేశములోను మీకు మీరే చెట్లు నరకుకొనుడని వారితో చెప్పెను.

2సమూయేలు 21:16

అప్పుడు రెఫాయీయుల సంతతివాడగు ఇష్బిబేనోబ అను ఒకడు ఉండెను. అతడు ధరించియున్న ఖడ్గము క్రొత్తది, వాని యీటె మూడువందల తులముల యెత్తు యిత్తడిగలది నేను దావీదును చంపెదనని అతడు చెప్పియుండెను.

1దినవృత్తాంతములు 19:19

తాము ఇశ్రాయేలీయుల చేతిలో ఓడిపోతిమని హదరెజెరుయొక్క సేవకులు తెలిసికొనినప్పుడు వారు దావీదుతో సమాధానపడి అతనికి సేవకులైరి. అంతటినుండి సిరియనులు అమ్మోనీయులకు సహాయము చేయుటకు మనస్సులేక యుండిరి.