ఆదికాండము 3: 7
క్రాస్-రిఫరెన్స్‌లు
" అప్పుడు వారిద్దరి కన్నులు తెరవబడెను; వారు తాము దిగంబరులమని తెలిసికొని అంజూరపు ఆకులు కుట్టి తమకు కచ్చడములను చేసికొనిరి."
సంబంధిత రిఫరెన్స్‌లు
ఏలయనగా మీరు వాటిని తిను దినమున మీ కన్నులు తెరవబడుననియు, మీరు మంచిచెడ్డలను ఎరిగినవారై దేవతలవలె ఉందురనియు దేవునికి తెలియునని స్త్రీతో చెప్పగా
నీ కన్నులయెదుట జరుగుదానిని చూచుటవలన నీకు వెఱ్ఱియెత్తును.
వారు షోమ్రోనులోనికి వచ్చినప్పుడు అతడు యెహోవా, వీరు చూచునట్లు వీరి కండ్లను తెరువుమని ప్రార్థన చేయగా యెహోవా వారి కండ్లను తెరవచేసెను గనుక వారు తాము షోమ్రోను మధ్య ఉన్నామని తెలిసికొనిరి.
అప్పుడతడు పాతాళములో బాధపడుచు, కన్నులెత్తి దూరమునుండి అబ్రాహామును అతని రొమ్మున (ఆనుకొనియున్న) లాజరును చూచి
అందుకతడు నేను తోటలో నీ స్వరము వినినప్పుడు దిగంబరినిగా నుంటినిగనుక భయపడి దాగుకొంటిననెను.
అందుకాయన నీవు దిగంబరివని నీకు తెలిపినవాడెవడు? నీవు తినకూడదని నేను నీకాజ్ఞాపించిన వృక్షఫలములు తింటివా? అని అడిగెను.
అప్పుడు ఆదామును అతని భార్యయు వారిద్దరు దిగంబరులుగా నుండిరి; అయితే వారు సిగ్గు ఎరుగక యుండిరి.
నన్ను దోషినిగా ఎంచవలసి వచ్చెను గదా కాబట్టి నాకు ఈ వ్యర్థప్రయాసమేల?
నేను హిమముతో నన్ను కడుగుకొనినను సబ్బుతో నాచేతులు కడుగుకొనినను
నీవు నన్ను గోతిలో ముంచెదవు అప్పుడు నేను నా స్వంతవస్త్రములకై అసహ్యుడనగుదును.
పండుకొనుటకు మంచము పొడుగు చాలదు కప్పుకొనుటకు దుప్పటి వెడల్పు చాలదు.
వారి పట్టుబట్ట నేయుటకు పనికిరాదు వారు నేసినది ధరించుకొనుటకు ఎవనికిని వినియోగింపదు వారి క్రియలు పాపక్రియలే వారు బలాత్కారము చేయువారే.
దేవుడైన యెహోవా ఆదామునకును అతని భార్యకును చర్మపు చొక్కాయిలను చేయించి వారికి తొడిగించెను.
ఇశ్రాయేలీయుల తరతరములవారికి, అనగా పూర్వము ఆ యుద్ధములను ఏ మాత్రమును చూడనివారికి యుద్ధముచేయ నేర్పునట్లు యెహోవా ఉండనిచ్చిన జనములు ఇవి.
అంతట అతడు యూదాదేశములోనుండి వచ్చిన దైవజనుని పిలిచి యెహోవా ఈలాగున ఆజ్ఞ ఇచ్చుచున్నాడు నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించినదానిని గైకొనక
ఆహాజు యూదాదేశమును దిగంబరినిగా చేసి యెహోవాకు ద్రోహము చేసియుండెను గనుక యెహోవా ఇశ్రాయేలు రాజైన ఆహాజు చేసినదానినిబట్టి యూదావారిని హీనపరచెను.
ఆదాము చేసినట్లు నా దోషములను దాచిపెట్టుకొని
మోసముచేసి తెచ్చుకొన్న ఆహారము మనుష్యులకు బహు ఇంపుగా ఉండును పిమ్మట వాని నోరు మంటితో నింపబడును.
ఇది యొకటిమాత్రము నేను కనుగొంటిని, ఏమనగా దేవుడు నరులను యథార్థవంతులనుగా పుట్టించెను గాని వారు వివిధమైన తంత్రములు కల్పించుకొనియున్నారు.
ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా నీ విటకాండ్రతో నీవు నీ సొమ్ము వ్యయపరచి నీవు వ్యభిచారము చేసి నీ మానము నీవు కనుపరచుకొనిన దానినిబట్టియు, నీ విటకాండ్రనుబట్టియు, హేయ విగ్రహములనుబట్టియు, నీవు వాటికప్పగించిన నీ బిడ్డల రక్తమునుబట్టియు,
శరీరములో ఏ అవయవములు ఘనతలేనివని తలంతుమో ఆ అవయవములను మరి ఎక్కువగా ఘనపరచుచున్నాము. సుందరములు కాని మన అవయవములకు ఎక్కువైన సౌందర్యము కలుగును.
ఈ గుడారములోనున్న మనము భారము మోసికొని మూల్గుచున్నాము.
నీవు దౌర్భాగ్యుడవును దిక్కుమాలిన వాడవును దరిద్రుడవును గ్రుడ్డివాడవును దిగంబరుడవునై యున్నావని యెరుగక నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసియున్నాను, నాకేమియు కొదువలేదని చెప్పుకొనుచున్నావు.