యోబు 12: 7
క్రాస్-రిఫరెన్స్‌లు
" అయినను మృగములను విచారించుము అవి నీకు బోధించును ఆకాశపక్షులను విచారించుము అవి నీకు తెలియజేయును."
సంబంధిత రిఫరెన్స్‌లు
దేశమున సంచరించువారిని మీరడుగలేదా? వారు తెలియజేసిన సంగతులు మీరు గురుతు పట్టలేదా?
అవి ఏవనగా దుర్జనులు ఆపత్కాలమందు కాపాడబడుదురు ఉగ్రతదినమందు వారు తోడుకొని పోబడుదురు.
సోమరీ, చీమల యొద్దకు వెళ్లుము వాటి నడతలు కనిపెట్టి జ్ఞానము తెచ్చుకొనుము.
ఎద్దు తన కామందు నెరుగును గాడిద సొంతవాని దొడ్డి తెలిసికొనును ఇశ్రాయేలుకు తెలివిలేదు నాజనులు యోచింపరు
ఆకాశములకెగురు సంకుబుడి కొంగయైనను తన కాలము నెరుగును, తెల్ల గువ్వయు మంగలకత్తి పిట్టయు ఓదెకొరుకును తాము రావలసిన కాలమును ఎరుగును, అయితే నా ప్రజలు యెహోవా న్యాయవిధిని ఎరుగరు.
వారు నీకు బోధించుదురు గదా వారు నీకు తెలుపుదురు గదా వారు తమ అనుభవమునుబట్టి మాటలాడుదురు గదా.
మీ దృష్టికి మృగములుగాను మూఢులుగాను మేమెంచబడుట ఏల?
భూమిమీద చిన్నవి నాలుగు కలవు అయినను అవి మిక్కిలి జ్ఞానము గలవి.