యోబు 15: 19
క్రాస్-రిఫరెన్స్‌లు
" అన్యులతో సహవాసము చేయక తాము స్వాస్థ్యముగా పొందిన దేశములో నివసించిన జ్ఞానులు చెప్పిన బోధను నీకు తెలిపెదను."
సంబంధిత రిఫరెన్స్‌లు
ఏబెరుకు ఇద్దరు కుమారులు పుట్టిరి. వారిలో ఒకని పేరు పెలెగు, ఏలయనగా అతని దినములలో భూమి దేశములుగా విభాగింపబడెను. అతని సహోదరుని పేరు యొక్తాను.
వారి వారి జనములలో వారి వారి సంతతుల ప్రకారము, నోవహు కుమారుల వంశములు ఇవే. జలప్రవాహము గతించిన తరువాత వీరిలో నుండి జనములు భూమిమీద వ్యాపించెను.
మహోన్నతుడు జనములకు వారి స్వాస్థ్యములను విభాగించినప్పుడు నరజాతులను ప్రత్యేకించినప్పుడు ఇశ్రాయేలీయుల లెక్కనుబట్టి ప్రజలకు సరిహద్దులను నియమించెను.
అన్యులికమీదట దానిలో సంచరింపకుండ యెరూషలేము పరిశుద్ధపట్టణముగా ఉండును; మీ దేవుడనైన యెహోవాను నేనే, నాకు ప్రతిష్ఠితమగు సీయోను పర్వతమందు నివ సించుచున్నానని మీరు తెలిసికొందురు.