లేఖనాలను అన్వేషించండి

యోబు 15: 33

క్రాస్-రిఫరెన్స్‌లు

" ద్రాక్షచెట్టు పిందెలు రాల్చునట్లు ఆయన వారిని రాల్చును. ఒలీవచెట్టు పువ్వులు రాల్చునట్లు ఆయన వారిని రాల్చును."

సంబంధిత రిఫరెన్స్‌లు

యెషయా 33:9

దేశము దుఃఖించి క్షీణించుచున్నది లెబానోను సిగ్గుపడి వాడిపోవుచున్నది షారోను ఎడారి ఆయెను బాషానును కర్మెలును తమ చెట్ల ఆకులను రాల్చుకొనుచున్నవి.

ప్రకటన 6:13

పెద్ద గాలిచేత ఊగులాడు అంజూరపు చెట్టునుండి అకాలపు కాయలు రాలినట్టు ఆకాశ నక్షత్రములు భూమిమీద రాలెను.

ద్వితియోపదేశాకాండము 28:39

ద్రాక్షతోటలను నీవు నాటి బాగుచేయుదువు గాని ఆ ద్రాక్షలరసమును త్రాగవు, ద్రాక్షపండ్లను సమకూర్చుకొనవు; ఏలయనగా పురుగు వాటిని తినివేయును.

ద్వితియోపదేశాకాండము 28:40

ఒలీవచెట్లు నీ సమస్త ప్రాంతములలో నుండును గాని తైలముతో తలనంటుకొనవు; నీ ఒలీవకాయలు రాలిపోవును.

సామెతలు 10:27

యెహోవాయందు భయభక్తులు కలిగియుండుట దీర్ఘాయువునకు కారణము భక్తిహీనుల ఆయుస్సు తక్కువైపోవును.

ప్రసంగి 7:17

అధికముగా దుర్మార్గపు పనులు చేయకుము, బుద్ధిహీనముగా తిరుగవద్దు; నీ కాలమునకు ముందుగా నీ వేల చనిపోదువు?