లేఖనాలను అన్వేషించండి

యోహాను 6: 23

క్రాస్-రిఫరెన్స్‌లు

" అయితే ప్రభువు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినప్పుడు వారు రొట్టె భుజించిన చోటునకు దగ్గరనున్న తిబెరియనుండి వేరే చిన్న దోనెలు వచ్చెను."

సంబంధిత రిఫరెన్స్‌లు

యోహాను 6:16

సాయంకాలమైనప్పుడు ఆయన శిష్యులు సముద్రము నొద్దకు వెళ్లి దోనె యెక్కి సముద్రపుటద్దరినున్న కపెర్నహూమునకు పోవుచుండిరి.

యోహాను 6:17

అంతలో చీకటాయెను గాని యేసు వారియొద్దకు ఇంకను రాలేదు.

మత్తయి 14:22

వెంటనే ఆ జనసమూహములను తాను పంపివేయునంతలో తన శిష్యులు దోనె యెక్కి తనకంటె ముందుగా అద్దరికి వెళ్లవలెనని ఆయన వారిని బలవంతము చేసెను.

మార్కు 6:45

ఆయన జనసమూహమును పంపివేయునంతలో, దోనె ఎక్కి అద్దరినున్న బేత్సయిదాకు ముందుగా వెళ్లుడని ఆయన తన శిష్యులను వెంటనే బలవంతము చేసెను.

1కొరిందీయులకు 10:3

అందరు ఆత్మ సంబంధమైన ఒకే ఆహారమును భుజించిరి;