లేఖనాలను అన్వేషించండి

న్యాయాధిపతులు 19: 11

క్రాస్-రిఫరెన్స్‌లు

" అతని ఉపపత్నియు అతనితో కూడ ఉండెను. వారు యెబూసునకు సమీపించినప్పుడు ప్రొద్దు చాలావ్రాలెను గనుక అతని దాసుడుమనము యెబూసీయులదైన యీ పట్టణము ప్రవేశించి దానిలో ఈ రాత్రి బసచేయుదము రండని తన యజమానునితో చెప్పగా"

సంబంధిత రిఫరెన్స్‌లు

న్యాయాధిపతులు 19:10

అతడు అక్కడ ఆ రాత్రి గడప నొల్లక లేచి వెళ్లి, యెబూసను యెరూషలేము ఎదుటికి వచ్చెను. అప్పుడు జీను కట్ట బడిన రెండు గాడిదలును

న్యాయాధిపతులు 1:21

యెరూషలేములో నివసించు యెబూసీ యులను బెన్యామీనీయులు వెళ్లగొట్టలేదు; యెబూసీ యులు బెన్యామీనీయులతో కూడ నేటివరకు యెరూషలేములో నివసించుచున్నారు.

ఆదికాండము 10:16

హివ్వీయులను అర్కీయులను సినీయులను

యెహోషువ 15:63

యెరూషలేములో నివసించిన యెబూసీ యులను యూదా వంశస్థులు తోలివేయ లేకపోయిరి గనుక యెబూసీయులు నేటివరకు యెరూషలేములో యూదా వంశస్థులయొద్ద నివసించుచున్నారు.

2సమూయేలు 5:6

యెబూసీయులు దేశములో నివాసులై యుండగా రాజును అతని పక్షమువారును యెరూషలేమునకు వచ్చిరి.

2సమూయేలు 24:16

అయితే దూత యెరూషలేము పైని హస్తము చాపి నాశనము చేయబోయినప్పుడు, యెహోవా ఆ కీడునుగూర్చి సంతాపమొంది అంతే చాలును, నీ చెయ్యి తీయుమని జనులను నాశనముచేయు దూతకు ఆజ్ఞ ఇచ్చెను.యెహోవా దూత యెబూసీయుడైన అరౌనాయొక్క కళ్లము దగ్గర ఉండగా

1దినవృత్తాంతములు 1:14

యెబూసీయులు అమోరీయులు గిర్గాషీయులు