న్యాయాధిపతులు 19: 16
క్రాస్-రిఫరెన్స్‌లు
" ఆ చోటి మనుష్యులు బెన్యామీనీయులు. సాయంకాల మున ఒక ముసలివాడు పొలములోని తన పనినుండి వచ్చెను. అతడు ఎఫ్రాయిమీయుల మన్య ప్రదేశము నుండి వచ్చి గిబియాలో నివసించువాడు. "
సంబంధిత రిఫరెన్స్‌లు
నీవు నేలకు తిరిగి చేరువరకు నీ ముఖపు చెమట కార్చి ఆహారము తిందువు; ఏలయనగా నేలనుండి నీవు తీయబడితివి; నీవు మన్నే గనుక తిరిగి మన్నైపోదువని చెప్పెను.
సాయంకాలమువరకు పాటుపడి తమ పనులను జరుపుకొనుటకై మనుష్యులు బయలువెళ్లుదురు.
నిశ్చయముగా నీవు నీచేతుల కష్టార్జితము ననుభవించెదవు నీవు ధన్యుడవు నీకు మేలు కలుగును.
మోసముచేత సంపాదించిన ధనము క్షీణించిపోవును కష్టము చేసి కూర్చుకొనువాడు తన ఆస్తిని వృద్ధి చేసికొనును.
ఏ కష్టము చేసినను లాభమే కలుగును వట్టి మాటలు లేమిడికి కారణములు.
బయట నీ పని చక్కపెట్టుకొనుము ముందుగా పొలములో దాని సిద్ధపరచుము తరువాత ఇల్లు కట్టుకొనవచ్చును.
ఆకాశముక్రింద జరుగునది అంతటిని జ్ఞానముచేత విచారించి గ్రహించుటకై నా మనస్సు నిలిపితిని; వారు దీనిచేత అభ్యాసము నొందవలెనని దేవుడు మానవులకు ఏర్పాటుచేసిన ప్రయాసము బహు కఠినమైనది.
కష్టజీవులు కొద్దిగా తినినను ఎక్కువగా తినినను సుఖనిద్ర నొందుదురు; అయితే ఐశ్వర్యవంతులకు తమ ధనసమృధ్థిచేత నిద్రపట్టదు.
దొంగిలువాడు ఇకమీదట దొంగిలక అక్కర గలవానికి పంచిపెట్టుటకు వీలుకలుగు నిమిత్తము తనచేతులతో మంచి పనిచేయుచు కష్టపడవలెను.
సంఘమునకు వెలుపటివారియెడల మర్యాదగా నడుచుకొనుచు, మీకేమియు కొదువ లేకుండునట్లు మేము మీకు ఆజ్ఞాపించిన ప్రకారము మీరు పరుల జోలికి పోక,
మీ సొంతకార్యములను జరుపుకొనుట యందును మీచేతులతో పనిచేయుట యందును ఆశకలిగి యుండవలెననియు, మిమ్మును హెచ్చరించుచున్నాము.
మరియు మేము మీయొద్ద ఉన్నప్పుడు--ఎవడైనను పనిచేయ నొల్లనియెడల వాడు భోజనము చేయకూడదని మీకు ఆజ్ఞాపించితివిు గదా.
అతడు మూడు సంవత్సరములు యెరూషలేమునందు ఏలెను; అతని తల్లిపేరు మీకాయా, ఆమె గిబియా ఊరివాడైన ఊరియేలు కుమార్తె.
మరియు మీరు ఏ పట్టణములోనైనను గ్రామములోనైనను ప్రవేశించునప్పుడు, అందులో ఎవడు యోగ్యుడో విచారణచేసి, అక్కడనుండి వెళ్లువరకు అతని యింటనే బసచేయుడి.