లేవీయకాండము 23: 25
క్రాస్-రిఫరెన్స్‌లు
" అందులో మీరు జీవనోపాధియైన ఏ పనియు చేయుట మాని యెహోవాకు హోమము చేయవలెను."
సంబంధిత రిఫరెన్స్‌లు
ఆ మొదటి దినమున మీరు పరిశుద్ధ సంఘముగాను, ఏడవ దినమున పరిశుద్ధ సంఘముగాను కూడుకొనవలెను. ఆ దినములయందు ప్రతివాడు తినవలసినది మాత్రమే మీరు సిద్ధపరచవచ్చును; అదియు గాక మరి ఏ పనియు చేయకూడదు.
నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుము మీరు చాటింపవలసిన యెహోవా నియామక కాలములు ఇవే; ఈ కాలములయందు మీరు పరిశుద్ధ సంఘములుగా కూడవలెను; నా నియామక కాలములు ఇవి.
వాటిలో మొదటి దినమున మీరు పరిశుద్ధసంఘముగా కూడవలెను. అందులో మీరు జీవనోపాధియైన యే పనియు చేయకూడదు.
ఏడవ దినమున పరిశుద్ధసంఘము కూడవలెను. ఆ దినమున మీరు జీవనోపాధియైన పనులేమియు చేయకూడదు.
ఏడవ నెల మొదటితేదిన మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలెను.
అమావాస్యనాడు కొమ్ము ఊదుడి మనము పండుగ ఆచరించు దినమగు పున్నమనాడు కొమ్ము ఊదుడి.