లూకా 12: 35
క్రాస్-రిఫరెన్స్‌లు
" మీ నడుములు కట్టుకొనియుండుడి, మీ దీపములు వెలుగుచుండనియ్యుడి."
సంబంధిత రిఫరెన్స్‌లు
నీ ధనమెక్కడ నుండునో అక్కడనే నీ హృదయము ఉండును.
మన పౌరస్థితి పరలోకమునందున్నది; అక్కడనుండి ప్రభువైన యేసుక్రీస్తు అను రక్షకుని నిమిత్తము కనిపెట్టుకొనియున్నాము.
మీరు క్రీస్తుతో కూడ లేపబడినవారైతే పైనున్న వాటినే వెదకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండియున్నాడు.
పైనున్న వాటిమీదనేగాని, భూసంబంధమైన వాటిమీద మనస్సు పెట్టుకొనకుడి;
ఏలయనగా మీరు మృతిపొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడ దేవునియందు దాచబడియున్నది.
ఇదియుగాక వారు తమ చరస్థిరాస్తులను అమ్మి, అందరికిని వారి వారి అక్కరకొలది పంచిపెట్టిరి.