లేఖనాలను అన్వేషించండి

లూకా 12: 37

క్రాస్-రిఫరెన్స్‌లు

" ప్రభువు వచ్చి యే దాసులు మెలకువగా ఉండుట కనుగొనునో ఆ దాసులు ధన్యులు; అతడు నడుము కట్టుకొని వారిని భోజనపంక్తిని కూర్చుండబెట్టి, తానే వచ్చి వారికి ఉపచారము చేయునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను."

సంబంధిత రిఫరెన్స్‌లు

లూకా 2:25

యెరూషలేమునందు సుమెయోనను ఒక మనుష్యుడుండెను. అతడు నీతిమంతుడును భక్తిపరుడునై యుండి, ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు; పరిశుద్ధాత్మ అతనిమీద ఉండెను.

లూకా 2:26

అతడు ప్రభువు యొక్క క్రీస్తును చూడకమునుపు మరణము పొందడని అతనికి పరిశుద్ధాత్మచేత బయలుపరచబడి యుండెను; ఆత్మవశుడై అతడు దేవాలయములోనికి వచ్చెను.

లూకా 2:27

అంతట ధర్మశాస్త్ర పద్ధతి చొప్పున ఆయన విషయమై జరిగించుటకు తలిదండ్రులు శిశువైన యేసును దేవాలయములోనికి తీసికొనివచ్చినప్పుడు

లూకా 2:28

అతడు తన చేతులలో ఆయనను ఎత్తికొని దేవుని స్తుతించుచు ఇట్లనెను

లూకా 2:29

నాథా, యిప్పుడు నీ మాటచొప్పున సమాధానముతో నీ దాసుని పోనిచ్చుచున్నావు;

లూకా 2:30

అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను నీ ప్రజలైన ఇశ్రాయేలుకు మహిమగాను

ఆదికాండము 49:18

యెహోవా, నీ రక్షణ కొరకు కనిపెట్టియున్నాను.

యెషయా 64:4

తనకొరకు కనిపెట్టువాని విషయమై నీవు తప్ప తన కార్యము సఫలముచేయు మరి ఏ దేవునిని ఎవడు నేకాలమున చూచియుండలేదు అట్టి దేవుడు కలడన్న సమాచారము మనుష్యులకు వినబడలేదు అట్టి సంగతి వారికి తెలిసియుండలేదు.

విలాపవాక్యములు 3:25

తన్ను ఆశ్రయించువారియెడల యెహోవా దయాళుడు తన్ను వెదకువారియెడల ఆయన దయచూపువాడు.

విలాపవాక్యములు 3:26

నరులు ఆశకలిగి యెహోవా అనుగ్రహించు రక్షణకొరకు ఓపికతో కనిపెట్టుట మంచిది.

మత్తయి 24:42

కావున ఏ దినమున మీ ప్రభువు వచ్చునో మీకు తెలియదు గనుక మెలకువగా నుండుడి.

మత్తయి 24:43

ఏ జామున దొంగవచ్చునో యింటి యజమానునికి తెలిసియుండినయెడల అతడు మెలకువగా ఉండి తన యింటికి కన్నము వేయనియ్యడని మీరెరుగుదురు.

మత్తయి 24:44

మీరనుకొనని గడియలో మనుష్యకుమారుడు వచ్చును గనుకనే మీరును సిద్ధముగా ఉండుడి.

మార్కు 13:34

ఒక మనుష్యుడు తన దాసులకు అధికారమిచ్చి, ప్రతివానికి వాని వాని పని నియమించి మెలకువగా నుండుమని ద్వారపాలకునికి ఆజ్ఞాపించి, యిల్లు విడిచి దేశాంతరము పోయినట్టే (ఆ కాలము ఉండును.)

మార్కు 13:35

ఇంటి యజమానుడు ప్రొద్దు గ్రుంకివచ్చునో, అర్ధరాత్రివచ్చునో, కోడికూయునప్పుడు వచ్చునో, తెల్లవారునప్పుడు వచ్చునో, యెప్పుడువచ్చునో మీకు తెలియదు.

మార్కు 13:36

ఆయన అకస్మాత్తుగా వచ్చి మీరు నిద్రబోవుచుండుట చూచునేమో గనుక మీరు మెలకువగా నుండుడి.

మార్కు 13:37

నేను మీతో చెప్పుచున్నది అందరితోను చెప్పుచున్నాను; మెలకువగా నుండుడనెను.

యాకోబు 5:7

సహోదరులారా, ప్రభువు రాకడ వరకు ఓపిక కలిగి యుండుడి; చూడుడి; వ్యవసాయకుడు తొలకరి వర్షమును కడవరి వర్షమును సమకూడు వరకు విలువైన భూఫలము నిమిత్తము ఓపికతో కాచుకొనుచు దానికొరకు కనిపెట్టును గదా

యాకోబు 5:8

ప్రభువు రాక సమీపించుచున్నది గనుక మీరును ఓపిక కలిగియుండుడి, మీ హృదయములను స్థిరపరచుకొనుడి.

2పేతురు 1:13

మరియు మన ప్రభువైన యేసుక్రీస్తు నాకు సూచించిన ప్రకారము నా గుడారమును త్వరగా విడిచి పెట్టవలసివచ్చునని యెరిగి,

2పేతురు 1:14

నేను ఈ గుడారములో ఉన్నంతకాలము ఈ సంగతులను జ్ఞాపకము చేసి మిమ్మును రేపుట న్యాయమని యెంచుకొనుచున్నాను.

2పేతురు 1:15

నేను మృతిపొందిన తరువాత కూడ మీరు నిత్యము వీటిని జ్ఞాపకము చేసికొనునట్లు జాగ్రత్తచేతును.

యూదా 1:20

ప్రియులారా, మీరు విశ్వసించు అతిపరిశుద్దమైన దానిమీద మిమ్మును మీరు కట్టుకొనుచు, పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయుచు,

యూదా 1:21

నిత్యజీవార్థమైన మన ప్రభువగు యేసుక్రీస్తు కనికరము కొరకు కనిపెట్టుచు, దేవుని ప్రేమలో నిలుచునట్లు కాచుకొనియుండుడి.

మత్తయి 22:1

యేసు వారికుత్తరమిచ్చుచు తిరిగి ఉపమానరీతిగా ఇట్లనెను.

మత్తయి 22:2

పరలోకరాజ్యము, తన కుమారునికి పెండ్లివిందు చేసిన యొక రాజును పోలియున్నది.

మత్తయి 22:3

ఆ పెండ్లివిందుకు పిలువబడిన వారిని రప్పించుటకు అతడు తన దాసులను పంపినప్పుడు వారు రానొల్లకపోయిరి.

మత్తయి 22:4

కాగా అతడు ఇదిగో నా విందు సిద్ధపరచియున్నాను; ఎద్దులును క్రొవ్విన పశువులును వధింపబడినవి; అంతయు సిద్ధముగా ఉన్నది; పెండ్లివిందుకు రండని పిలువబడిన వారితో చెప్పుడని వేరే దాసులను పంపెను గాని

మత్తయి 22:5

వారు లక్ష్యము చేయక, ఒకడు తన పొలమునకును మరియొకడు తన వర్తకమునకును వెళ్లిరి.

మత్తయి 22:6

తక్కినవారు అతని దాసులను పట్టుకొని అవమానపరచి చంపిరి.

మత్తయి 22:7

కాబట్టి రాజు కోపపడి తన దండ్లను పంపి, ఆ నరహంతకులను సంహరించి, వారి పట్టణము తగలబెట్టించెను.

మత్తయి 22:8

అప్పుడతడు పెండ్లివిందు సిద్ధముగా ఉన్నది గాని పిలువబడినవారు పాత్రులు కారు.

మత్తయి 22:9

గనుక రాజమార్గములకు పోయి మీకు కనబడు వారినందరిని పెండ్లివిందుకు పిలువుడని తన దాసులతో చెప్పెను.

మత్తయి 22:10

ఆ దాసులు రాజమార్గములకు పోయి చెడ్డవారినేమి మంచివారినేమి తమకు కనబడినవారినందరిని పోగుచేసిరి గనుక విందుకు వచ్చినవారితో ఆ పెండ్లిశాల నిండెను.

మత్తయి 22:11

రాజు కూర్చున్నవారిని చూడ లోపలికి వచ్చి, అక్కడ పెండ్లివస్త్రము ధరించుకొనని యొకని చూచి

మత్తయి 22:12

స్నేహితుడా, పెండ్లివస్త్రము లేక ఇక్కడికేలాగు వచ్చితివని అడుగగా వాడు మౌనియై యుండెను.

మత్తయి 22:13

అంతట రాజు వీని కాళ్లు చేతులు కట్టి వెలుపటి చీకటిలోనికి త్రోసివేయుడి; అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయు ఉండునని పరిచారకులతో చెప్పెను.

మత్తయి 22:14

కాగా పిలువబడినవారు అనేకులు, ఏర్పరచబడినవారు కొందరే అని చెప్పెను.

మత్తయి 25:1

పరలోకరాజ్యము, తమ దివిటీలు పట్టుకొని పెండ్లికుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరిన పదిమంది కన్యకలను పోలియున్నది.

మత్తయి 25:2

వీరిలో అయిదుగురు బుద్ధి లేనివారు, అయిదుగురు బుద్ధి గలవారు.

మత్తయి 25:3

బుద్ధి లేనివారు తమ దివిటీలు పట్టుకొని తమతోకూడ నూనె తీసికొనిపోలేదు.

మత్తయి 25:4

బుద్ధి గలవారు తమ దివిటీలతోకూడ సిద్దెలలో నూనె తీసికొనిపోయిరి.

మత్తయి 25:5

పెండ్లికుమారుడు ఆలస్యము చేయగా వారందరు కునికి నిద్రించుచుండిరి.

మత్తయి 25:6

అర్ధరాత్రివేళ ఇదిగో పెండ్లికుమారుడు, అతనిని ఎదుర్కొన రండి అను కేక వినబడెను.

మత్తయి 25:7

అప్పుడు ఆ కన్యకలందరు లేచి తమ దివిటీలను చక్కపరచిరి గాని

మత్తయి 25:8

బుద్ధిలేని ఆ కన్యకలు మా దివిటీలు ఆరిపోవుచున్నవి గనుక మీ నూనెలో కొంచెము మాకియ్యుడని బుద్ధిగలవారినడిగిరి.

మత్తయి 25:9

అందుకు బుద్ధిగల కన్యకలు మాకును మీకును ఇది చాలదేమో, మీరు అమ్మువారియొద్దకు పోయి కొనుక్కొనుడని చెప్పిరి.

మత్తయి 25:10

వారు కొనబోవుచుండగా పెండ్లికుమారుడు వచ్చెను, అప్పుడు సిద్ధపడి యున్నవారు అతనితో కూడ పెండ్లివిందుకు లోపలికిపోయిరి;

మత్తయి 25:11

అంతట తలుపు వేయబడెను. ఆ తరువాత తక్కిన కన్యకలు వచ్చి అయ్యా, అయ్యా, మాకు తలుపు తీయుమని అడుగగా

మత్తయి 25:12

అతడు మిమ్మునెరుగనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాననెను.

మత్తయి 25:13

ఆ దినమైనను గడియయైనను మీకు తెలియదు గనుక మెలకువగా ఉండుడి.

ప్రకటన 3:20

ఇదిగో నేను తలుపునొద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరము విని తలుపుతీసినయెడల, నేను అతనియొద్దకు వచ్చి అతనితో నేనును, నాతోకూడ అతడును భోజనము చేయుదుము.

మత్తయి 25:10

వారు కొనబోవుచుండగా పెండ్లికుమారుడు వచ్చెను, అప్పుడు సిద్ధపడి యున్నవారు అతనితో కూడ పెండ్లివిందుకు లోపలికిపోయిరి;

1కొరిందీయులకు 1:7

గనుక ఏ కృపావరమునందును లోపము లేక మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రత్యక్షత కొరకు ఎదురుచూచుచున్నారు.

2దెస్సలోనీకయులకు 3:5

దేవునియందలి ప్రేమయు క్రీస్తు చూపిన ఓర్పును మీకు కలుగునట్లు ప్రభువు మీ హృదయములను ప్రేరేపించును గాక.