లేఖనాలను అన్వేషించండి

లూకా 21: 32

క్రాస్-రిఫరెన్స్‌లు

" అవన్నియు జరుగువరకు ఈ తరము గతింపదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను."

సంబంధిత రిఫరెన్స్‌లు

లూకా 12:51

నేను భూమిమీద సమాధానము కలుగజేయ వచ్చితినని మీరు తలంచుచున్నారా? కాదు; భేదమునే కలుగజేయ వచ్చితినని మీతో చెప్పుచున్నాను.

లూకా 12:52

ఇప్పుటినుండి ఒక ఇంటిలో అయిదుగురు వేరుపడి, ఇద్దరికి విరోధముగా ముగ్గురును, ముగ్గురికి విరోధముగా యిద్దరును ఉందురు.

లూకా 12:53

తండ్రి కుమారునికిని, కుమారుడు తండ్రికిని, తల్లి కుమార్తెకును, కుమార్తె తల్లికిని, అత్త కోడలికిని, కోడలు అత్తకును విరోధులుగా ఉందురని చెప్పెను.

లూకా 12:54

మరియు ఆయన జనసమూహములతో ఇట్లనెను మీరు పడమటనుండి మబ్బు పైకివచ్చుట చూచునప్పుడు వాన వచ్చుచున్నదని వెంటనే చెప్పుదురు; ఆలాగే జరుగును.

లూకా 12:55

దక్షిణపు గాలి విసరుట చూచునప్పుడు వడగాలి కొట్టునని చెప్పుదురు; ఆలాగే జరుగును.

లూకా 12:56

వేషధారులారా, మీరు భూమ్యాకాశముల వైఖరి గుర్తింప నెరుగుదురు; ఈ కాలమును మీరు గుర్తింప నెరుగరేల?

లూకా 12:57

ఏది న్యాయమో మీ అంతట మీరు విమర్శింపరేల?

మత్తయి 16:1

అప్పుడు పరిసయ్యులును సద్దూకయ్యులును వచ్చి ఆయనను శోధించుటకు ఆకాశమునుండి యొక సూచక క్రియను తమకు చూపుమని ఆయనను అడుగగా ఆయన ఇట్లనెను

మత్తయి 16:2

సాయంకాలమున మీరు ఆకాశము ఎఱ్ఱగా ఉన్నది గనుక వర్షము కురియదనియు,

మత్తయి 16:3

ఉదయమున ఆకాశము ఎఱ్ఱగాను మబ్బుగాను ఉన్నది గనుక నేడు గాలివాన వచ్చుననియు చెప్పుదురు గదా. మీరు ఆకాశవైఖరి వివేచింప నెరుగుదురు గాని యీ కాలముల సూచనలను వివేచింపలేరు.

మత్తయి 16:4

వ్యభిచారులైన చెడ్డతరము వారు సూచక క్రియ నడుగుచున్నారు, అయితే యోనానుగూర్చిన సూచక క్రియయేగాని మరి ఏ సూచక క్రియయైన వారికనుగ్రహింపబడదని వారితో చెప్పి వారిని విడిచి వెళ్లిపోయెను.

హెబ్రీయులకు 10:37

ఇక కాలము బహు కొంచెముగా ఉన్నది, వచ్చుచున్నవాడు ఆలస్యము చేయక వచ్చును.

యాకోబు 5:9

సహోదరులారా, మీరు తీర్పు పొందకుండు నిమిత్తము ఒకనిమీదనొకడు సణగకుడి; ఇదిగో న్యాయాధిపతి వాకిట నిలిచియున్నాడు.

1పేతురు 4:7

అయితే అన్నిటి అంతము సమీపమైయున్నది. కాగా మీరు స్వస్థబుద్ధి గలవారై, ప్రార్థనలు చేయుటకు మెలకువగా ఉండుడి.

లూకా 22:18

ఇకమీదట దేవుని రాజ్యము వచ్చువరకు నేను ద్రాక్షారసము త్రాగనని మీతో చెప్పుచున్నాననెను.

గలతీయులకు 3:7

కాబట్టి విశ్వాస సంబంధులే అబ్రాహాము కుమారులని మీరు తెలిసికొనుడి.