లేఖనాలను అన్వేషించండి

లూకా 22: 15

క్రాస్-రిఫరెన్స్‌లు

" అప్పుడాయన నేను శ్రమపడక మునుపు మీతోకూడ ఈ పస్కాను భుజింపవలెనని మిక్కిలి ఆశపడితిని."

సంబంధిత రిఫరెన్స్‌లు

ద్వితియోపదేశాకాండము 16:6

నీ దేవుడైన యెహోవా తన నామమును స్థాపించుటకై ఏర్పరచుకొను స్థలములోనే నీవు ఐగుప్తులోనుండి బయలుదేరివచ్చినbవేళను, అనగా సూర్యుడు అస్తమించు సాయంకాలమున పస్కా పశువును వధించి

ద్వితియోపదేశాకాండము 16:7

నీ దేవుడైన యెహోవా ఏర్పరచుకొను స్థలమున దానిని కాల్చి భుజించి, ఉదయమున తిరిగి నీ గుడారములకు వెళ్లవలెను. ఆరు దినములు నీవు పొంగని రొట్టెలు తినవలెను.

మత్తయి 26:20

సాయంకాలమైనప్పుడు ఆయన పండ్రెండుమంది శిష్యులతోకూడ భోజనమునకు కూర్చుండెను.

మార్కు 14:17

సాయంకాలమైనప్పుడు ఆయన తన పండ్రెండుమంది శిష్యులతో కూడ వచ్చెను.

మత్తయి 10:2

ఆ పండ్రెండుమంది అపొస్తలుల పేర్లు ఏవనగా, మొదట పేతురనబడిన సీమోను, అతని సహోదరుడగు అంద్రెయ; జెబెదయి కుమారుడగు యాకోబు, అతని సహోదరుడగు యోహాను;

రోమీయులకు 2:10

సత్‌ క్రియ చేయు ప్రతివానికి, మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడ, మహిమయు ఘనతయు సమాధానమును కలుగును.