లేఖనాలను అన్వేషించండి

లూకా 22: 50

క్రాస్-రిఫరెన్స్‌లు

" ఆయన చుట్టు ఉన్నవారు జరుగబోవు దానిని చూచి ప్రభువా, కత్తితో నరుకుదుమా అని ఆయనను అడిగిరి."

సంబంధిత రిఫరెన్స్‌లు

2రాజులు 6:21

అంతట ఇశ్రాయేలు రాజు వారిని పారజూచి నాయనా వీరిని కొట్టుదునా, కొట్టుదునా? అని ఎలీషాను అడుగగా

మత్తయి 14:28

పేతురు ప్రభువా, నీవే అయితే నీళ్లమీద నడిచి నీయొద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మని ఆయనతో అనెను.

మత్తయి 26:51

ఇదిగో యేసుతో కూడ ఉన్నవారిలో ఒకడు చెయ్యి చాచి, కత్తి దూసి ప్రధానయాజకుని దాసుని కొట్టి, వాని చెవి తెగనరికెను.

మార్కు 14:47

దగ్గర నిలిచియున్నవారిలో ఒకడు కత్తి దూసి ప్రధానయాజకుని దాసుని కొట్టి వాని చెవి తెగనరికెను.

యోహాను 18:10

సీమోను పేతురునొద్ద కత్తి యుండినందున అతడు దానిని దూసి, ప్రధానయాజకుని దాసుని కొట్టి అతని కుడిచెవి తెగనరికెను.

అపోస్తలులకార్యములు 4:30

రోగులను స్వస్థపరచుటకును, నీ పరిశుద్ధ సేవకుడైన యేసు నామము ద్వారా సూచక క్రియలను మహత్కార్యములను చేయుటకును నీ చెయ్యి చాచియుండగా, నీ దాసులు బహు ధైర్యముగా నీ వాక్యమును బోధించునట్లు అనుగ్రహించుము.