మార్కు 2: 12
క్రాస్-రిఫరెన్స్‌లు
" తక్షణమే వాడు లేచి, పరుపెత్తికొని, వారందరియెదుట నడచిపోయెను గనుక, వారందరు విభ్రాంతినొంది మనమీలాటి కార్యములను ఎన్నడును చూడలేదని చెప్పుకొనుచు దేవుని మహిమపరచిరి."
సంబంధిత రిఫరెన్స్‌లు
ఆయన కనికరపడి, చెయ్యిచాపి వానిని ముట్టి నాకిష్టమే; నీవు శుద్ధుడవు కమ్మని వానితో చెప్పెను.
యేసు నీవు లేచి నీ పరుపెత్తికొని నడువుమని వానితో చెప్పగా
వెంటనే వాడు స్వస్థతనొంది తన పరుపెత్తికొని నడిచెను.
ఆ దినము విశ్రాంతిదినము గనుక యూదులు ఇది విశ్రాంతిదినము గదా; నీవు నీ పరుపెత్తికొన తగదే అని స్వస్థత నొందినవానితో చెప్పిరి.
ఆత్మయే జీవింపచేయుచున్నది; శరీరము కేవలము నిష్‌ప్రయోజనము. నేను మీతో చెప్పియున్న మాటలు ఆత్మయు జీవమునైయున్నవి గాని
ఆయన నీ దోషములన్నిటిని క్షమించువాడు నీ సంకటములన్నిటిని కుదుర్చువాడు.
వాడు నడుచుచు దేవుని స్తుతించుట ప్రజలందరు చూచి
అతడు పౌలు మాటలాడుట వినెను. పౌలు అతనివైపు తేరిచూచి, స్వస్థత పొందుటకు అతనికి విశ్వాసముండెనని గ్రహించి