లేఖనాలను అన్వేషించండి

మార్కు 2: 5

క్రాస్-రిఫరెన్స్‌లు

" యేసు వారి విశ్వాసము చూచి కుమారుడా, నీ పాపములు క్షమింపబడియున్నవని పక్షవాయువు గలవానితో చెప్పెను."

సంబంధిత రిఫరెన్స్‌లు

ద్వితియోపదేశాకాండము 22:8

క్రొత్త యిల్లు కట్టించునప్పుడు దానిమీదనుండి యెవడైనను పడుటవలన నీ యింటిమీదికి హత్యదోషము రాకుండుటకై నీ యింటి పైకప్పునకు చుట్టు పిట్టగోడ కట్టింపవలెను.

లూకా 5:19

జనులు గుంపుకూడి యుండినందున, వానిని లోపలికి తెచ్చుటకు వల్లపడకపోయెను గనుక, ఇంటిమీదికెక్కి పెంకులు విప్పి, మంచముతో కూడ యేసు ఎదుట వారి మధ్యను వానిని దించిరి.

మత్తయి 9:2

ఇదిగో జనులు పక్షవాయువుతో మంచముపట్టియున్న యొకని ఆయనయొద్దకు తీసికొనివచ్చిరి. యేసు వారి విశ్వాసము చూచి కుమారుడా ధైర్యముగా ఉండుము, నీ పాపములు క్షమింపబడియున్నవని పక్షవాయువు గల వానితో చెప్పెను.

అపోస్తలులకార్యములు 5:16

మరియు యెరూషలేము చుట్టునుండు పట్టణముల జనులు రోగులను అపవిత్రాత్మలచేత పీడింపబడిన వారిని మోసికొని కూడివచ్చిరి. వారందరు స్వస్థత పొందిరి.