మత్తయి 14: 29
క్రాస్-రిఫరెన్స్‌లు
" ఆయన రమ్మనగానే పేతురు దోనెదిగి యేసునొద్దకు వెళ్లుటకు నీళ్లమీద నడచెను గాని"
సంబంధిత రిఫరెన్స్‌లు
పేతురు ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించితివిు గనుక మాకేమి దొరకునని ఆయనను అడుగగా
అందుకు పేతురు నీ విషయమై అందరు అభ్యంతరపడినను నేను ఎప్పుడును అభ్యంతరపడనని ఆయనతో చెప్పగా
యేసు అతని చూచి ఈ రాత్రి కోడి కూయకమునుపే నీవు నన్ను ఎరుగనని ముమ్మారు చెప్పెదవని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాననెను.
పేతురాయనను చూచి నేను నీతోకూడ చావవలసి వచ్చినను, నిన్ను ఎరుగనని చెప్పననెను; అదే ప్రకారము శిష్యులందరు అనిరి.
అతడు మరి ఖండితముగా నేను నీతోకూడ చావవలసి వచ్చినను నిన్ను ఎరుగనని చెప్పనే చెప్పననెను. అట్లు వారందరు ననిరి.
సీమోనూ, సీమోనూ, ఇదిగో సాతాను మిమ్మును పట్టి గోధుమలవలె జల్లించుటకు మిమ్మును కోరుకొనెను గాని
నీ నమ్మిక తప్పిపోకుండునట్లు నేను నీకొరకు వేడుకొంటిని; నీ మనసు తిరిగిన తరువాత నీ సహోదరులను స్థిరపరచుమని చెప్పెను.
అయితే అతడు ప్రభువా, నీతోకూడ చెరలోనికిని మరణమునకును వెళ్లుటకు సిద్ధముగా ఉన్నానని ఆయనతో అనగా
ఆయన పేతురూ, నీవు నన్నెరుగనని ముమ్మారు చెప్పువరకు, నేడు కోడి కూయదని నీతో చెప్పుచున్నాననెను.
యేసు యూదా, నీవు ముద్దుపెట్టుకొని మనుష్యకుమారుని అప్పగించుచున్నావా అని వానితో అనగా
ఆయన చుట్టు ఉన్నవారు జరుగబోవు దానిని చూచి ప్రభువా, కత్తితో నరుకుదుమా అని ఆయనను అడిగిరి.
సీమోను పేతురు ప్రభువా, యెవనియొద్దకు వెళ్లుదుము? నీవే నిత్యజీవపు మాటలు గలవాడవు;
సీమోను పేతురు ప్రభువా, నీవెక్కడికి వెళ్లుచున్నావని ఆయనను అడుగగా యేసు నేను వెళ్లుచున్నచోటికి నీవిప్పుడు నావెంట రాలేవుగాని, తరువాత వచ్చెదవని అతనితో చెప్పెను.
అందుకు పేతురు ప్రభువా, నేనెందుకు ఇప్పుడు నీ వెంట రాలేను? నీకొరకు నా ప్రాణము పెట్టుదునని ఆయనతో చెప్పగా
యేసు నాకొరకు నీ ప్రాణము పెట్టుదువా? ఆయనను ఎరుగనని నీవు ముమ్మారు చెప్పకముందు కోడి కూయదని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాననెను.
తన్నుతాను ఎంచుకొనతగిన దానికంటె ఎక్కువగా ఎంచుకొనక, దేవుడు ఒక్కొకనికి విభజించి యిచ్చిన విశ్వాస పరిమాణ ప్రకారము, తాను స్వస్థబుద్ధి గలవాడగుటకై తగినరీతిగా తన్ను ఎంచుకొనవలెనని, నాకు అనుగ్రహింపబడిన కృపనుబట్టి మీలోనున్న ప్రతి వానితోను చెప్పుచున్నాను.
తరువాత ఆయన దోనె యెక్కి వారియొద్దకు వచ్చినప్పుడు గాలి అణగెను, అందుకు వారు తమలోతాము మిక్కిలి విభ్రాంతినొందిరి;
కాబట్టి యేసు ప్రేమించిన శిష్యుడు ఆయన ప్రభువు సుమి అని పేతురుతో చెప్పెను. ఆయన ప్రభువని సీమోను పేతురు విని, వస్త్రహీనుడై యున్నందున పైబట్టవేసి సముద్రములో దుమికెను.