మత్తయి 14: 35
క్రాస్-రిఫరెన్స్‌లు
" అక్కడి జనులు ఆయనను గుర్తుపట్టి, చుట్టుపట్లనున్న ఆ ప్రదేశమంతటికి వర్తమానము పంపి, రోగులనందరిని ఆయనయొద్దకు తెప్పించి"
సంబంధిత రిఫరెన్స్‌లు
వారు అవతలకు వెళ్లి గెన్నేసరెతు దగ్గర ఒడ్డుకు వచ్చి దరి పట్టిరి.
వారు దోనె దిగగానే, జనులు ఆయనను గురుతుపట్టి
ఆ ప్రదేశమందంతట పరుగెత్తికొనిపోయి, ఆయన యున్నాడని వినిన చోటునకు రోగులను మంచములమీద మోసికొని వచ్చుటకు మొదలుపెట్టిరి.
గ్రామములలోను పట్టణములలోను పల్లెటూళ్లలోను ఆయన యెక్కడెక్కడ ప్రవేశించెనో అక్కడి జనులు రోగులను సంత వీథులలో ఉంచి, వారిని ఆయన వస్త్రపుచెంగు మాత్రము ముట్టనిమ్మని ఆయనను వేడుకొనుచుండిరి. ఆయనను ముట్టినవారందరు స్వస్థతనొందిరి.
జనసమూహము దేవుని వాక్యము వినుచు ఆయనమీద పడుచుండగా ఆయన గెన్నేసరెతు సరస్సు తీరమున నిలిచి,
షెపామునుండి సరిహద్దు అయీనుకు తూర్పున రిబ్లావరకు నుండును. ఆ సరిహద్దు దిగి తూర్పున కిన్నెరెతు సముద్రమునొడ్డును తగిలియుండును.
అంతట వారు కపెర్నహూములోనికి వెళ్లిరి. వెంటనే ఆయన విశ్రాంతిదినమున సమాజమందిరములోనికి పోయి బోధించెను.