సంఖ్యాకాండము 14: 23
క్రాస్-రిఫరెన్స్‌లు
" కాగా వారి పితరులకు ప్రమాణపూర్వకముగా నేనిచ్చిన దేశమును వారు చూడనే చూడరు; నన్ను అలక్ష్యము చేసినవారిలో ఎవరును దానిని చూడరు."
సంబంధిత రిఫరెన్స్‌లు
మోషే అహరోనులు సీనాయి అరణ్యములో ఇశ్రాయేలీయుల సంఖ్యను చేసినప్పుడు లెక్కింపబడినవారిలో ఒక్కడైనను వీరిలో ఉండలేదు.
ఇరువది ఏండ్లు మొదలుకొని పై ప్రాయము కలిగి ఐగుప్తు దేశములోనుండి వచ్చిన మనుష్యులలో పూర్ణమనస్సుతో యెహోవాను అనుసరించిన కెనెజీయుడగు యెఫున్నె కుమారుడైన కాలేబును నూను కుమారుడైన యెహోషువయు తప్ప
బహుగా కోపపడి నేను మీ పితరులకిచ్చెదనని ప్రమాణము చేసిన యీ మంచిదేశమును ఈ చెడ్డతరమువారిలో
యెఫున్నె కుమారుడైన కాలేబు తప్ప మరి ఎవడును చూడడు. అతడు పూర్ణమనస్సుతో యెహోవాను అనుసరించెను గనుక అతడు దానిని చూచును. అతడు అడుగుపెట్టిన దేశమును నేను అతనికిని అతని సంతానమునకును ఇచ్చెదనని ప్రమాణముచేసెను.
మరియు యెహోవా మిమ్మునుబట్టి నామీద కోపపడి నీ పరిచారకుడగు నూను కుమారుడైన యెహోషువ దానిలో ప్రవేశించునుగాని నీవు దానిలో ప్రవేశింపవు.
అతడు ఇశ్రాయేలీయులు దాని స్వాధీనపరచుకొనచేయును గనుక అతని ధైర్యపరచుము.
ఆ దినమున మంచిచెడ్డలనెరుగని మీ కుమారులు, అనగా అపహరింపబడుదురని మీరు చెప్పిన మీ పిల్లలు దానిలో ప్రవేశింతురు; దానిని వారికిచ్చెదను; వారు దానిని స్వాధీనపరచుకొందురు.
మీరు తిరిగి ఎఱ్ఱసముద్రమార్గముగా అరణ్యమునకు ప్రయాణము చేయుడని చెప్పెను.
అందుకు మీరు మేము యెహోవాకు విరోధముగా పాపము చేసితివిు; మా దేవుడైన యెహోవా మాకాజ్ఞాపించిన మాటలన్నిటిననుసరించి మేము పోయి యుద్ధము చేసెదమని నాతో ఉత్తరమిచ్చి, మీరందరు మీ ఆయుధములను కట్టుకొని, ఆలోచింపక ఆ మన్నెమునకు పోగా
యెహోవా నాతో ఇట్లనెను యుద్ధమునకు పోకుడి; నేను మీ మధ్యనుండనుగనుక వెళ్లకుడి; మీరు వెళ్లినను మీ శత్రువులయెదుట హతము చేయబడుదురని వారితో చెప్పుము.
ఆ మాటలు నేను మీతో చెప్పినప్పుడు మీరు వినక యెహోవా మాటకు తిరుగబడి మూర్ఖులై ఆ మన్నెమునకు వెళ్లితిరి.
అప్పుడు ఆ మన్నెములో నివసించిన అమోరీయులు మీకెదురుగా బయలుదేరి వచ్చి, కందిరీగలవలె మిమ్ము తరిమి హోర్మావరకు శేయీరులో మిమ్ము హతముచేసిరి.
తరువాత మీరు తిరిగివచ్చి యెహోవా సన్నిధిని యేడ్వగా, యెహోవా మీ మొఱను లక్ష్యపెట్టలేదు, మీ మాట వినలేదు.
వారి సంతతిని ఆకాశపు నక్షత్రములంత విస్తారముగా చేసి, ప్రవేశించి స్వతంత్రించుకొనునట్లు వారి పితరులకు నీవు వాగ్దానము చేసిన దేశములోనికి వారిని రప్పింపగా
కావున నేను కోపించి వీరెన్నడును నా విశ్రాంతిలో ప్రవేశింపకూడదని ప్రమాణము చేసితిని.
అప్పుడు అరణ్యములో వారిని కూలచేయుటకును
మరియు తమకిష్టమైన విగ్రహముల ననుసరింపవలెనని కోరి, వారు నా విధులను తృణీకరించి నా కట్టడల ననుసరింపక నేను నియమించిన విశ్రాంతిదినములను అపవిత్రపరచగా
ఎవరిమీద నలువది ఏండ్లు ఆయన కోపగించెను? పాపము చేసినవారి మీదనే గదా? వారి శవములు అరణ్యములో రాలిపోయెను.
తన విశ్రాంతిలో ప్రవేశింపరని యెవరినిగూర్చి ప్రమాణము చేసెను? అవిధేయులైనవారినిగూర్చియే గదా
కాగా జగత్పునాది వేయబడినప్పుడే ఆయన కార్యములన్నియు సంపూర్తియై యున్నను ఈ విశ్రాంతినిగూర్చి నేను కోపముతో ప్రమాణము చేసినట్టు వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరు అని ఆయన చెప్పిన మాట అనుసరించి, విశ్వాసులమైన మనము ఆ విశ్రాంతిలో ప్రవేశించుచున్నాము.
యెహోవా ఎన్నాళ్లవరకు ఈ ప్రజలు నన్ను అలక్ష్యము చేయుదురు? ఎన్నాళ్లవరకు నేను వారి మధ్యను చేసిన సూచక క్రియలన్నిటిని చూచి నన్ను నమ్మకయుందురు?
నీవు వారితో యెహోవా వాక్కు ఏదనగా నా జీవముతోడు; మీరు నా చెవిలో చెప్పినట్లు నేను నిశ్చయముగా మీయెడల చేసెదను.
ఏలయనగా వారు నిశ్చయముగా అరణ్యములో చనిపోవుదురని యెహోవా వారినిగూర్చి సెలవిచ్చెను. యెపున్నె కుమారుడైన కాలేబును నూను కుమారుడైన యెహోషువయు తప్ప వారిలో ఒక్కడైనను మిగిలియుండలేదు.
ఆ దినమున యెహోవా కోపము రగులుకొని
యెహోవా మనకు ఏ దేశమును ఇచ్చెదనని వారి పితరులతో ప్రమా ణముచేసెనో, పాలు తేనెలు ప్రవహించు ఆ దేశమును తాను వారికి చూపింపనని యెహోవా ప్రమాణము చేసి యుండెను గనుక ఐగుప్తులోనుండి వచ్చిన ఆ యోధు లందరు యెహోవా మాట వినకపోయినందున వారు నశించువరకు ఇశ్రాయేలీయులు నలువది సంవత్సరములు అరణ్యములో సంచరించుచు వచ్చిరి.
యెహోవా యెహోషువకు ఇచ్చిన ఆజ్ఞచొప్పున యూదా వంశస్థుల మధ్యను యెఫున్నె కుమారుడైన కాలేబునకు ఒక వంతును, అనగా అనాకీయుల వంశకర్త యైన అర్బాయొక్క పట్టణమును ఇచ్చెను, అది హెబ్రోను.
సెలవిచ్చినదేమనగా నేను నీతో చేసిన నా నిబంధనను కట్టడలను నీవు ఆచరింపకపోవుట నేను కనుగొనుచున్నాను గనుక యీ రాజ్యము నీకుండకుండ నిశ్చయముగా తీసివేసి నీ దాసునికిచ్చెదను.
ఏరులై పారుచున్న తేనెను వెన్నపూసను చూచి వారు సంతోషింపరు.
గర్విష్ఠులు ధన్యులగుదురనియు యెహోవాను శోధించు దుర్మార్గులు వర్ధిల్లుదురనియు, వారు సంరక్షణ పొందుదురనియు మీరు చెప్పుకొనుచున్నారు.
నేడు మీరాయన శబ్దమును వినినయెడల, అరణ్యములో శోధన దినమందు కోపము పుట్టించినప్పటివలె మీ హృదయములను కఠినపరచుకొనకుడి.