లేఖనాలను అన్వేషించండి

సంఖ్యాకాండము 14: 25

క్రాస్-రిఫరెన్స్‌లు

" అతని సంతతి దాని స్వాధీనపరచుకొనును. అమాలేకీయులును కనానీయులును ఆ లోయలో నివసించుచున్నారు. రేపు మీరు తిరిగి ఎఱ్ఱసముద్రపు మార్గముగా అరణ్యమునకు ప్రయాణమైపొండనెను."

సంబంధిత రిఫరెన్స్‌లు

సంఖ్యాకాండము 13:29

అమాలేకీయులు దక్షిణ దేశములో నివసించుచున్నారు; హిత్తీయులు యెబూసీయులు అమోరీయులు కొండ దేశములో నివసించుచున్నారు; కనానీయులు సముద్రమునొద్దను యొర్దాను నదీప్రాంతములలోను నివసించుచున్నారని చెప్పిరి.

సంఖ్యాకాండము 14:4

వారు మనము నాయకుని ఒకని నియమించుకొని ఐగుప్తునకు తిరిగి వెళ్లుదమని ఒకనితోఒకడు చెప్పుకొనగా

ద్వితియోపదేశాకాండము 1:40

మీరు తిరిగి ఎఱ్ఱసముద్రమార్గముగా అరణ్యమునకు ప్రయాణము చేయుడని చెప్పెను.

కీర్తనలు 81:11

అయినను నా ప్రజలు నా మాట ఆలకింపకపోయిరి ఇశ్రాయేలీయులు నా మాట వినకపోయిరి.

కీర్తనలు 81:12

కాబట్టి వారు తమ స్వకీయాలోచనలనుబట్టి నడుచుకొనునట్లు వారి హృదయకాఠిన్యమునకు నేను వారినప్పగించితిని.

కీర్తనలు 81:13

అయ్యో నా ప్రజలు నా మాట వినినయెడల ఇశ్రాయేలు నా మార్గముల ననుసరించినయెడల ఎంత మేలు!

సామెతలు 1:31

కాబట్టి వారు తమ ప్రవర్తనకు తగిన ఫలము ననుభవించెదరు తమకు వెక్కసమగువరకు తమ ఆలోచనలను అనుసరించెదరు

సంఖ్యాకాండము 14:41

అప్పుడు మోషే ఇది ఏల? మీరు యెహోవా మాట మీరుచున్నారేమి?

సంఖ్యాకాండము 14:43

ఏలయనగా అమాలేకీయులు కనానీయులు మీకంటె ముందుగా అక్కడికి చేరియున్నారు; మీరు ఖడ్గముచేత కూలుదురు; మీరు యెహోవాను అనుసరించుట మానితిరి గనుక ఇక యెహోవా మీకు తోడైయుండడని చెప్పెను.

సంఖ్యాకాండము 21:4

వారు ఎదోముదేశమును చుట్టిపోవలెనని హోరు కొండనుండి ఎఱ్ఱసముద్రమార్గముగా సాగినప్పుడు మార్గాయాసముచేత జనుల ప్రాణము సొమ్మసిల్లెను.

సంఖ్యాకాండము 33:35

ఎబ్రోనాలోనుండి బయలుదేరి ఎసోన్గెబెరులో దిగిరి.

ద్వితియోపదేశాకాండము 1:46

కాగా మీరు కాదేషులో బహు దినములు నివసించితిరి. మీరు నివసించిన దినములెన్నో మీకు తెలిసినవి.

ద్వితియోపదేశాకాండము 2:1

మరియు యెహోవా నాతో చెప్పినట్లు మనము తిరిగి ఎఱ్ఱసముద్రమార్గమున అరణ్యమునకు ప్రయాణమైపోయి బహు దినములు శేయీరు మన్నెము చుట్టు తిరిగితివిు.

న్యాయాధిపతులు 11:16

ఇశ్రాయేలీయులు ఐగుప్తులోనుండి వచ్చుచుండగా వారు ఎఱ్ఱసముద్రము వరకు అరణ్యములో నడిచి కాదేషునకు వచ్చిరి.

హెబ్రీయులకు 3:11

గనుక నేను కోపముతో ప్రమాణము చేసినట్టు వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరని చెప్పితిని.