లేఖనాలను అన్వేషించండి

సంఖ్యాకాండము 27: 4

క్రాస్-రిఫరెన్స్‌లు

" అతనికి కుమారులు కలుగలేదు; అతనికి కుమారులు లేనంతమాత్రముచేత మా తండ్రిపేరు అతని వంశములోనుండి మాసిపోనేల? మా తండ్రి సహోదరులతో పాటు స్వాస్థ్యమును మాకు దయచేయుమనిరి."

సంబంధిత రిఫరెన్స్‌లు

నిర్గమకాండము 32:11

మోషే తన దేవుడైన యెహోవాను బ్రతిమాలుకొని యెహోవా, నీవు మహాశక్తివలన బాహుబలమువలన ఐగుప్తు దేశములోనుండి రప్పించిన నీ ప్రజలమీద నీ కోపము మండనేల?

కీర్తనలు 109:13

వాని వంశము నిర్మూలము చేయబడును గాక వచ్చు తరమునందు వారి పేరు మాసిపోవును గాక

సామెతలు 13:9

నీతిమంతుల వెలుగు తేజరిల్లును భక్తిహీనుల దీపము ఆరిపోవును.

యెహోషువ 17:4

వారు యాజకుడైన ఎలియాజరు ఎదుటి కిని నూను కుమారుడైన యెహోషువ యెదుటికిని ప్రధా నుల యెదుటికిని వచ్చిమా సహోదరులమధ్య మాకు స్వాస్థ్యమియ్యవలెనని యెహోవా మోషేకు ఆజ్ఞాపించె నని మనవి చేయగా యెహోషువ యెహోవా సెలవిచ్చినట్టు వారి తండ్రి యొక్క సహోదరులమధ్య వారికి స్వాస్థ్యములిచ్చెను.

1దినవృత్తాంతములు 2:34

షేషానునకు కుమార్తెలే గాని కుమారులు లేకపోయిరి; ఈ షేషానునకు యర్హా అను ఒక దాసుడుండెను, వాడు ఐగుప్తీయుడు