లేఖనాలను అన్వేషించండి

సంఖ్యాకాండము 29: 5

క్రాస్-రిఫరెన్స్‌లు

" వాటి నైవేద్యము నూనెతో కలుపబడిన గోధుమపిండి ప్రతి కోడెదూడతో తూములో మూడు పదియవవంతులను, పొట్టేలుకు రెండు పదియవవంతులను,"

సంబంధిత రిఫరెన్స్‌లు

సంఖ్యాకాండము 28:15

నిత్యమైన దహనబలియు దాని పానార్పణమును గాక యొక మేకపిల్లను పాపపరిహారార్థబలిగా యెహోవాకు అర్పింపవలెను.

సంఖ్యాకాండము 28:22

మీకు ప్రాయశ్చిత్తము కలుగుటకై పాపపరిహారార్థబలిగా ఒక మేకను అర్పింపవలెను.

సంఖ్యాకాండము 28:30

మీ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయబడుటకై యొక మేకపిల్లను అర్పింపవలెను.

లేవీయకాండము 4:23

అతడు ఏ పాపము చేసి పాపియాయెనో అది తనకు తెలియబడినయెడల, అతడు నిర్దోషమైన మగ మేకపిల్లను అర్పణముగా తీసికొనివచ్చి

యెహెజ్కేలు 45:23

మరియు ఏడు దినములు అతడు నిర్దోషమైన యేడు ఎడ్లను ఏడు పొట్టేళ్ళను తీసికొని, దినమొకటింటికి ఒక యెద్దును ఒక పొట్టేలును దహనబలిగా యెహోవాకు అర్పింపవలెను; మరియు అనుదినము ఒక్కొక్క మేకపిల్లను పాపపరిహారార్థబలిగా అర్పింపవలెను.