లేఖనాలను అన్వేషించండి

సంఖ్యాకాండము 29: 9

క్రాస్-రిఫరెన్స్‌లు

" నూనెతో కలుపబడిన పిండిని నైవేద్యముగాను ప్రతి కోడెతో తూములో మూడు పదియవవంతులను ఒక పొట్టేలుతో రెండు పదియవవంతులను"

సంబంధిత రిఫరెన్స్‌లు

సంఖ్యాకాండము 15:3

యెహోవాకు ఇంపైన సువాసన కలుగునట్లుగా గోవులలోని దానినేకాని, గొఱ్ఱమేకలలోని దానినేకాని, దహనబలిగానైనను, బలిగానైనను తెచ్చి, మ్రొక్కుబడి చెల్లించుటకనియో, స్వేచ్ఛార్పణగాననియో, నియామక కాలమందు అర్పించునదియనియో, దేనినైనను మీరు అర్పింపగోరినయెడల

సంఖ్యాకాండము 15:4

యెహోవాకు ఆ అర్పణము నర్పించువాడు ముప్పావు నూనెతో కలుపబడిన రెండు పళ్ల పిండిని నైవేద్యముగా తేవలెను.

సంఖ్యాకాండము 15:5

ఒక్కొక్క గొఱ్ఱపిల్లతో కూడ దహనబలిమీదనేమి బలిమీదనేమి పోయుటకై ముప్పావు ద్రాక్షారసమును పానార్పణముగా సిద్ధపరచవలెను.

సంఖ్యాకాండము 15:6

పొట్టేలుతో కూడ పడి నూనెతో కలుపబడిన నాలుగు పళ్ల పిండిని నైవేద్యముగా సిద్ధపరచవలెను.

సంఖ్యాకాండము 15:7

పడి ద్రాక్షారసమును పానార్పణముగా తేవలెను; అది యెహోవాకు ఇంపైన సువాసన.

సంఖ్యాకాండము 15:8

మ్రొక్కుబడిని చెల్లించుటకైనను యెహోవాకు సమాధానబలి నర్పించుటకైనను నీవు దహనబలిగానైనను బలిగానైనను కోడెదూడను సిద్ధపరచినయెడల

సంఖ్యాకాండము 15:9

ఆ కోడెతో కూడ పడిన్నర నూనె కలుపబడిన ఆరు పళ్ల గోధుమ పిండిని నైవేద్యముగా అర్పింపవలెను.

సంఖ్యాకాండము 15:10

మరియు యెహోవాకు ఇంపైన సువాసనగల హోమముగా

సంఖ్యాకాండము 15:11

పడిన్నర ద్రాక్షారసమును పానీయార్పణముగా తేవలెను; ఒక్కొక్క కోడెతో కూడను ఒక్కొక్క పొట్టేలుతో కూడను, గొఱ్ఱలలోనిదైనను మేకలలోనిదైనను ఒక్కొక్క పిల్లతో కూడను, ఆలాగు చేయవలెను.

సంఖ్యాకాండము 15:12

మీరు సిద్ధపరచువాటి లెక్కనుబట్టి వాటి లెక్కలో ప్రతిదానికిని అట్లు చేయవలెను.

సంఖ్యాకాండము 29:18

వాటి వాటి లెక్కచొప్పున, ఆ కోడెలతోను పొట్టేళ్లతోను గొఱ్ఱపిల్లలతోను వాటి వాటి నైవేద్యమును