లేఖనాలను అన్వేషించండి

సంఖ్యాకాండము 35: 10

క్రాస్-రిఫరెన్స్‌లు

" మీరు యొర్దాను దాటి కనాను దేశములోనికి వెళ్లిన తరువాత"

సంబంధిత రిఫరెన్స్‌లు

సంఖ్యాకాండము 34:2

కనాను దేశమున, అనగా పొలిమేరలచొప్పున మీరు చీట్లువేసి స్వాస్థ్యముగా పంచుకొను కనాను దేశమున

లేవీయకాండము 14:34

నేను స్వాస్థ్యముగా మీకిచ్చుచున్న దేశమునకు మీరు వచ్చిన తరువాత, మీ స్వాస్థ్యమైన దేశములోని యే యింటనైనను నేను కుష్ఠుపొడ కలుగజేసినయెడల

లేవీయకాండము 25:2

నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుము నేను మీకిచ్చుచున్న దేశములోనికి మీరు వచ్చిన తరువాత ఆ భూమికూడ యెహోవా పేరట విశ్రాంతికాలమును, ఆచరింపవలెను.

ద్వితియోపదేశాకాండము 12:9

నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న విశ్రాంతిని స్వాస్థ్యమును మీరు ఇదివరకు పొందలేదు.

ద్వితియోపదేశాకాండము 19:1

నీ దేవుడైన యెహోవా యెవరి దేశమును నీకిచ్చుచున్నాడో ఆ జనములను నీ దేవుడైన యెహోవా నాశనము చేసిన తరువాత నీవు వారి దేశమును స్వాధీనపరచుకొని, వారి పట్టణములలోను వారి యిండ్లలోను నివసించునప్పుడు

ద్వితియోపదేశాకాండము 19:2

నీవు స్వాధీనపరచుకొనునట్లు నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న దేశములో మూడు పురములను వేరుపరచవలెను.