లేఖనాలను అన్వేషించండి

సంఖ్యాకాండము 35: 27

క్రాస్-రిఫరెన్స్‌లు

" నరహత్య విషయములో ప్రతిహత్య చేయువాడు ఆశ్రయపురముయొక్క సరిహద్దు వెలుపల వాని కనుగొనినయెడల, ఆ ప్రతిహంతకుడు ఆ నరహంతకుని చంపినను వానిమీద ప్రాణముతీసిన దోషము ఉండదు."

సంబంధిత రిఫరెన్స్‌లు

నిర్గమకాండము 22:2

దొంగ కన్నము వేయుచుండగా వాడు దొరికి చచ్చునట్లు కొట్టబడినయెడల అందువలన రక్తాపరాధముండదు.

ద్వితియోపదేశాకాండము 19:6

వానికి మరణదండన విధిలేదు. అయితే హత్య విషయములో ప్రతిహత్య చేయువాని మనస్సు కోపముతో మండుచుండగా, మార్గము దూరమైనందున వాడు నరహంతకుని తరిమి వాని కలిసికొని వాని చావగొట్టకయుండునట్లు ఆ నరహంతకుడు పారిపోయి ఆ పురములలో ఒకదానియందు జొచ్చి బ్రదుకును.

ద్వితియోపదేశాకాండము 19:10

ప్రాణము తీసిన దోషము నీమీద మోపబడకుండునట్లు నీ దేవుడైన యెహోవా నీకు స్వాస్థ్యముగా ఇచ్చుచున్న నీ దేశమున నిర్దోషియొక్క ప్రాణము తీయకుండవలెను.

ఆదికాండము 4:14

నేడు ఈ ప్రదేశమునుండి నన్ను వెళ్లగొట్టితివి; నీ సన్నిధికి రాకుండ వెలివేయబడి దిగులుపడుచు భూమిమీద దేశదిమ్మరినైయుందును. కావున నన్ను కనుగొనువాడెవడో వాడు నన్ను చంపునని యెహోవాతో అనెను.

సంఖ్యాకాండము 35:19

హత్య విషయములో ప్రతిహత్య చేయువాడు తానే నరహంతకుని చంపవలెను.

2సమూయేలు 14:11

అప్పుడు ఆమె రాజవైన నీవు నీ దేవుడైన యెహోవాను స్మరించి హత్యకు ప్రతిహత్య చేయువారు నా కుమారుని నశింపజేయకుండ ఇకను నాశనము చేయుట మాన్పించుమని మనవిచేయగా రాజు యెహోవా జీవముతోడు నీ కుమారుని తల వెండ్రుకలలో ఒకటైనను నేల రాలకుండుననెను.