సామెతలు 26: 1
క్రాస్-రిఫరెన్స్‌లు
" ఎండకాలమునకు మంచు గిట్టదు కోతకాలమునకు వర్షము గిట్టదు అటువలె బుద్ధిహీనునికి ఘనత గిట్టదు."
సంబంధిత రిఫరెన్స్‌లు
పరాక్రమశాలికంటె దీర్ఘశాంతము గలవాడు శ్రేష్ఠుడు పట్టణము పట్టుకొనువానికంటె తన మనస్సును స్వాధీనపరచుకొనువాడు శ్రేష్ఠుడు
కోపచిత్తునితో సహవాసము చేయకుము క్రోధము గలవానితో పరిచయము కలిగియుండకుము
సౌలు యోనాతానుమీద బహుగా కోపపడి ఆగడగొట్టుదాని కొడుకా, నీకును నీ తల్లి మానమునకును సిగ్గు కలుగునట్లుగా నీవు యెష్షయి కుమారుని స్వీకరించిన సంగతి నాకు తెలిసినది కాదా?
అయితే మా యజమానునికిని అతని ఇంటివారికందరికిని వారు కీడుచేయ నిశ్చయించియున్నారు గనుక ఇప్పుడు నీవు చేయవలసినదానిని బహు జాగ్రత్తగా ఆలోచించుము. మన యజమానుడు బహు పనికిమాలినవాడు, ఎవనిని తనతో మాటలాడనీయడు అనెను.
మూఢుడు కోపపడునది నిమిషములోనే బయలుపడును వివేకి నిందను వెల్లడిపరచక యూరకుండును.
దీర్ఘశాంతము గలవాడు మహా వివేకి ముంగోపి మూఢత్వమును బహుమానముగా పొందును.
మహా కోపియగువాడు దండన తప్పించుకొనడు వాని తప్పించినను వాడు మరల కోపించుచునే యుండును.
నా ప్రియ సహోదరులారా, మీరీసంగతి ఎరుగుదురు గనుక ప్రతి మనుష్యుడు వినుటకు వేగిరపడువాడును, మాటలాడుటకు నిదానించువాడును, కోపించుటకు నిదా నించువాడునై యుండవలెను.