సామెతలు 6: 19
క్రాస్-రిఫరెన్స్‌లు
" లేనివాటిని పలుకు అబద్ధసాక్షియు అన్నదమ్ములలో జగడములు పుట్టించువాడును."
సంబంధిత రిఫరెన్స్‌లు
కీడుచేయ పన్నాగములు పన్నువానికి తంటాలమారి అని పేరు పెట్టబడును.
నరుల చెడుతనము భూమిమీద గొప్పదనియు, వారి హృదయము యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడు కేవలము చెడ్డదనియు యెహోవా చూచి
వాడు మంచముమీదనే పాపయోచనను యోచించును వాడు కానినడతలు నడచువాడు చెడుతనము వానికి అసహ్యము కాదు.
యెరూషలేమా, నీవు రక్షింపబడునట్లు నీ హృదయములోనుండి చెడుతనము కడిగివేసికొనుము, ఎన్నాళ్లవరకు నీ దుష్టాభిప్రాయములు నీకు కలిగియుండును?
మంచములమీద పరుండి మోసపు క్రియలు యోచించుచు దుష్కార్యములు చేయువారికి శ్రమ; ఆలాగు చేయుట వారి స్వాధీనములో నున్నది గనుక వారు ప్రొద్దు పొడవగానే చేయుదురు.
తన పొరుగువాని మీద ఎవడును దుర్యోచన యోచింపకూడదు, అబద్ద ప్రమాణముచేయ నిష్టపడకూడదు, ఇట్టివన్నియు నాకు అసహ్యములు; ఇదే యెహోవా వాక్కు.
కీడు చేయుటకై వారి పాదములు పరుగులెత్తును నరహత్య చేయుటకై వారు త్వరపడుచుందురు.
వారి కాళ్లు పాపముచేయ పరుగెత్తుచున్నవి నిరపరాధులను చంపుటకు అవి త్వరపడును వారి తలంపులు పాపహేతుకమైన తలంపులు పాడును నాశనమును వారి త్రోవలలో ఉన్నవి
రక్తము చిందించుటకు వారి పాదములు పరుగెత్తుచున్నవి.
వారు పండుకొనకముందు ఆ పట్టణస్థులు, అనగా సొదొమ మనుష్యులు, బాలురును వృద్ధులును ప్రజలందరును నలుదిక్కులనుండి కూడివచ్చి ఆ యిల్లు చుట్టవేసి
శూరుడా, చేసిన కీడునుబట్టి నీ వెందుకు అతిశయపడుచున్నావు? దేవుని కృప నిత్యముండును.
నీ పొరుగువాడు నీయొద్ద నిర్భయముగా నివసించునపుడు వానికి అపకారము కల్పింపవద్దు.
వాని హృదయము అతిమూర్ఖ స్వభావము గలది వాడెల్లప్పుడు కీడు కల్పించుచు జగడములు పుట్టించును.
సత్పురుషునికి యెహోవా కటాక్షము చూపును దురాలోచనలు గలవాడు నేరస్థుడని ఆయన తీర్పు తీర్చును.
త్వరగా కోపపడువాడు మూఢత్వము చూపును. దుర్యోచనలు గలవాడు ద్వేషింపబడును.
ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా ఆ కాలమందు నీ మనస్సులో అభిప్రాయములు పుట్టును,
విధవరాండ్రను తండ్రిలేనివారిని పరదేశులను దరిద్రులను బాధపెట్టకుడి, మీ హృదయమందు సహోదరులలో ఎవరికిని కీడు చేయదలచకుడి.